‘సరిలేరు నీకెవ్వరు’పై చెడు ప్రచారం.. ఆధారాలతో నిరూపిస్తున్న ఫ్యాన్స్

By Manoj Kumar P

తన గత చిత్రం 'మహర్షి' సక్సెస్‌ అవడంతో జోష్ మీదున్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ఈ ఫలితంతో అదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. అదే.. 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్స్‌కు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆ సినిమాల్లో లాగే ఇందులో కూడా..

ఆ సినిమాల్లో లాగే ఇందులో కూడా..

‘సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించినప్పటికీ కామెడీ ట్రాక్‌కే పెద్ద పీట వేశారని తెలుస్తోంది. సీరియస్ బోర్డర్ సీక్వెన్సెస్ తర్వాత మహేష్ కాశ్మీర్ నుంచి ఇంటికి వచ్చే ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేశారట. ఇందుకోసం ట్రైన్‌లో మహేష్, ఇతర నటీనటులతో హిలేరియస్ కామెడీ పండించాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. మొత్తంగా ఈ సినిమా అనిల్ మార్క్ కంటెంట్‌తో వస్తుందట.

మహేశ్‌కు సెంటిమెంట్లు ఎక్కువే

మహేశ్‌కు సెంటిమెంట్లు ఎక్కువే

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకడైన మహేశ్ బాబుకు సెంటిమెంట్లు ఎక్కువన్న టాక్ ఉంది. ఈయన తన ప్రతి సినిమా విషయంలో ఎన్నో రకాల సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా నటీ నటుల ఎంపిక, లొకేషన్లు, సెట్లు, రిలీజ్ డేట్లు ఇలా అన్ని విషయాల్లో ఆయన సెంటిమెంట్ ఫాలో అవుతుంటాడని చాలా సార్లు వార్తలు కూడా వెలువడ్డాయి.

అందుకే అలా చేయించాడట

అందుకే అలా చేయించాడట

‘సరిలేరు నీకెవ్వరు' కోసం ఓ విలేజ్ సెట్ వేశారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు మూడు ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ సారథ్యంలో ఈ సెట్ వేశారని అన్నారు. విలేజ్‌లో షూటింగ్ అంటే ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశ్యంతో ఈ సెట్ వేయిస్తున్నట్లు యూనిట్ చెప్పినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇలా సెట్ వేయడం వెనుక కూడా మహేశ్ సెంటిమెంట్ ఉందన్న టాక్ కూడా వినిపించింది. దీనికి కారణం గతంలో ఆయన సినిమాల్లో సెట్ వేస్తే హిట్ అవడమేనట.

ఇప్పుడు మరో సెంటిమెంట్

ఇప్పుడు మరో సెంటిమెంట్

తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు' విషయంలో మరో సెంటిమెంట్ బయటకు వచ్చింది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అంశాన్ని బట్టి.. మహేశ్ బాబు సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ‘టక్కరి దొంగ', ‘1 నేనొక్కడినే' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఫలితంపై చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తాజాగా ఓ గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

అందులో నిజం లేదు.. రికార్డు బాగుంది

అందులో నిజం లేదు.. రికార్డు బాగుంది

వాస్తవానికి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని మహేశ్ అభిమానుల్లోని కొందరు వాదిస్తున్నారు. అంతేకాదు, సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాలను సొంతం చేసుకున్న ‘ఒక్కడు', ‘బిజినెస్ మ్యాన్', ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలను ఉదహరిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. సో.. ‘సరిలేరు'పై ఎవరూ ఆందోళన చెందక్కర్లేదని పలువురు చెబుతున్నారు.

Recommended Video

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
సరిలేరు నీకెవ్వరు గురించి

సరిలేరు నీకెవ్వరు గురించి

సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా లేడీ అమితాజ్ విజయశాంతి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. అలాగే బండ్ల గణేష్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X