For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable With NBK: దటీజ్ బాలయ్య, తాను సాయం చేయడమే కాకుండా, మోహన్ బాబుతో కూడా!

  |

  తండ్రి సినీ వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో పోటీ పడుతూ గట్టి పోటీ ఇచ్చిన బాలకృష్ణ ఇప్పుడు కూడా కుర్రహీరోలతో పోటీ పడుతున్నారు. అయితే తాజాగా ఆహా ఓటీటీ కోసం హోస్ట్ గా మారిన బాలకృష్ణ ఆ షో ఎండింగ్ లో చేసిన ఒక పని ఇప్పుడు అందరినీ కుదిపేస్తోంది. బాలకృష్ణ చేసిన పని ఇప్పుడు ప్రసంశలు అందుకుంటోంది. అలాగే ఆ షో గెస్ట్ గా వచ్చిన మోహన్ బాబు కూడా ప్రసంశలు దక్కించుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  వెనక్కి తగ్గకుండా

  వెనక్కి తగ్గకుండా

  గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చివరిగా హిట్ కొట్టిన బాలయ్య ఆ తర్వాత మరో హిట్ కొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో ఆయన ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అనుపించుకో లేక పోయాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా బాలకృష్ణ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.

  బోయపాటితో

  బోయపాటితో

  ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న బాలకృష్ణ గతంలో తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీనుతో మళ్ళీ టీమ్ అయ్యి సినిమా చేస్తున్నారు. అఖండ పేరుతో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయ జానకి నాయక నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు..తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

  గోపీచంద్ తో

  గోపీచంద్ తో

  బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ అఖండ సినిమా పూర్తి కాకముందే బాలకృష్ణ ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ లైన్లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ తో ఒక సినిమా ఫైనల్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికయింది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆహా ఓటీటీలో ఒక టాక్ షో చేస్తున్నాడు బాలయ్య.

  అజీజ్ కు అండగా

  అజీజ్ కు అండగా

  మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ గెస్టులుగా రాగా చివరలో పదేళ్ళ అజీజ్, అతని సోదరిని పిలిచారు. హైదరాబాద్ కు చెందిన అజీజ్ అనే బుడతడు చదువుకుంటున్నాడు. అతని సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతుందని తెలుసుకున్న అజీజ్ చదువు మధ్యలోనే మానేసాడు. సోదరి బేగంను ఎలాగైనా కాపాడుకోవాలని కూలి పని కి వెళ్తున్నాడు. కూలీ పని చేయగా వచ్చిన డబ్బుతో తన సోదరికి ఆపరేషన్ చేయించాలన్నది అజీజ్ తపన.

  1997 Movie Team Interview.. టాప్ టెకనీషియన్లు వర్క్ చేసిన చిత్రం
  ప్రసంశలు అందుకుంటూ

  ప్రసంశలు అందుకుంటూ

  అయితే ఎలా తెలిసిందో ఏమో కానీ ఈ విషయం బాలయ్య చెవిన పడడంతో షోకి పిలిపించడంతో పాటు బేగంకు బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తానని వాగ్దానం చేశాడు. ఓ చిన్నారి ప్రాణం కాపాడటం కోసం బాలయ్య బాబు చేసిన పనికి పలువురి ప్రశంసలందుకుంటున్నారు. ఇక అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె షో ద్వారా ఈ విషయం తెలుసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అజీజ్ కు విద్యా సాయం చేస్తామని వెల్లడించారు. ఇక షో చివరిలో మోహన్ బాబు ఈ షో గ్రాండ్ సక్సెస్ సాధించాలని అభిలషించారు.

  English summary
  Balakrishna and mohan babu to help aziz's family through Unstoppable With NBK.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X