For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య కోపం ప్రత్యేకంగా చెప్పాలా? అవమానిస్తున్నావ్... రానాకు స్వీట్ వార్నింగ్

    |

    రానా అందరితో చాలా సరదాగా, కూల్ యాటిట్యూడ్‌తో ఉంటారు... బాలయ్యతో ఎందుకు పెట్టుకున్నారు అనుకుంటున్నారా? ఇదంతా రానా హోస్ట్ చేస్తున్న 'నెం.1 యారి విత్ రానా' రియాల్టీ షోలో చోటు చేసుకున్న సంఘటన. అయితే సీరియస్ ఇష్యూ అయితే కాదు, జస్ట్ సరదాగా సాగిన కార్యక్రమం.

    బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా వీరి నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం అవుతుంది. తాజాగా ప్రోమో వదిలారు.

    సార్ అని పిలవడం మానవయ్యా

    సార్ అని పిలవడం మానవయ్యా

    రానా... సార్ అని పిలుస్తుండటంతో ‘నువ్వు ముందు సార్ పిలవడం మానేయవయ్యా' అంటూ బాలయ్య సూచించడం గమనార్హం. ఈ షోలో నందమూరి నటసింహం ఎంతో ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా కనిపించారు.

     రానాకు పంచ్ పడిందిగా...

    రానాకు పంచ్ పడిందిగా...

    మీ చిన్న వయసులోకి వెళదాం అంటూ అప్పటి సంగతులను రాబట్టే ప్రయత్నం రానా చేయగా.... ‘నేను ఇప్పటికీ చిన్నవాడినే కదా' అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు బాలయ్య.

    యూ ఆర్ ఇన్సల్టింగ్ మి

    యూ ఆర్ ఇన్సల్టింగ్ మి

    రానా అడిగిన ఓ ప్రశ్నకు బాలయ్య ‘నువ్వు నన్ను అవమానిస్తున్నావ్' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మరి బాలయ్య ఏ సందర్భంలో అలా అన్నారో తెలియాలంటే ఫుల్ షో ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే.

    రానా కోరిన విధంగా ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్

    రానా కోరిన విధంగా ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్

    బాలయ్యకు కొన్ని స్మైలీ సింబల్స్ ఇచ్చి వాటిలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలని కోరగా.... బాలయ్య తనదైన శైలిలో హావభావాలు పలికిస్తూ నవ్వించారు.

    రొమాంటిక్ డ్రామానే

    రొమాంటిక్ డ్రామానే

    సోషియో ఫాంటసీ, రొమాంటిక్ డ్రామా... వీటిలో బాలకృష్ణగారు ఏది ఎంచుకుంటారు అని రానా ప్రశ్నించగా క్రిష్ రియాక్ట్ అవుతూ... ‘కచ్చితంగా రొమాంటిక్ డ్రామా' అని సమాధానం ఇచ్చారు. దానికి బాలయ్య క్రిష్ వైపు సరదాగా ఉరిమి చూశారు.

    బాలయ్యకు బాగా కోపం వస్తుంది

    బాలకృష్ణ గారికి బాగా కోపం వస్తుంది? అవునా? కాదా? అనే ప్రశ్నకు... ‘చెప్పాలా అది నీకు' అంటూ క్రిష్ ఆచితూచి రియాక్ట్ అయ్యారు.

    English summary
    Telugu Superstars and No1Yaars, Balakrishna, Krish & Rana Daggubati star in the 12th episode of McDowell's No.1 Luxury Soda - #No1YaariWithRana Season-2. Catch them live this Sunday, 30th Dec, 8:30 pm on Gemini TV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X