For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పరాకాష్టకు చేరిన బాలకృష్ణ తీరు, నడిరోడ్డుపై అభిమానిని చితకబాదాడు (వైరల్ వీడియో)

  |
  AP Assembly Election 2019 : Balakrishna Beats His Fan, Video Goes Viral || Filmibeat Telugu

  నందమూరి బాలకృష్ణ సినిమా సెట్స్‌లో ఉన్నారంటే అక్కడ వాతావరణం కాస్త భయం భయంగా ఉంటుందని చెబుతుంటారు. ఎందుకంటే బాలయ్యకు నచ్చని విధంగా అక్కడ ఏం జరిగినా పరిస్థితి మరోలా ఉంటుందట. ఎందుకు అంత భయం ఆయనేమైనా కొడతారా? తిడతారా? అని అడిగితే.. నోరు విప్పి అక్కడ జరిగిన విషయాలు చెప్పే దైర్యం ఇప్పటి ఎవరూ చేయలేకపోయారు. అయితే బాలకృష్ణ తనకు తానుగా తన స్వభావం ఎలాంటిదో పలు సందర్భాల్లో మీడియా ముంఖంగా బయట పెట్టుకున్నారు. తన అభిమానులపై దాడులు చేయడం, వారి ఫోన్లు పగలగొట్టడం, దుర్భాషలాడటం లాంటివి చేస్తూ వార్తల్లోకి ఎక్కారు.

  తెలుగు దేశం పార్టీ తరుపున హిందూపూరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న బాలయ్య... ప్రచార పర్వంలో తన విశ్వరూపం చూపిస్తున్నారు. తనకు మద్దతుగా ఉన్న అభిమానులపై కూడా దాడులు చేస్తూ, దుర్భాషలాడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

  పరాకాష్టకు చేరిన బాలకృష్ణ తీరు, నడిరోడ్డుపై అభిమానిని చితకబాదాడు

  పరాకాష్టకు చేరిన బాలకృష్ణ తీరు, నడిరోడ్డుపై అభిమానిని చితకబాదాడు

  తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీకి ప్రచారం నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిని కాలర్ పట్టుకుని చితకబాదడం చర్చనీయాంశం అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడి రోడ్డు మీద, వందల మంది కార్యకర్తల ముందు బాలయ్య ఇలా ప్రవర్తించడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

  బాలయ్య ఉంటే ఇలాంటివి కామన్!

  బాలయ్య ఉంటే ఇలాంటివి కామన్!

  బాలకృష్ణ గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి దాడులు చేయడంతో... బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగడం కామన్ అనే పరిస్థితి ఏర్పడింది. బాలయ్య చేతిలో దాడులకు గురైంది ఆయనంటే ఇష్టపడే అభిమానులే కావడం గమనార్హం.

  అలా అనడం కూడా బాలయ్య దృష్టిలో తప్పే..

  అలా అనడం కూడా బాలయ్య దృష్టిలో తప్పే..

  ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉండగా బాలకృష్ణ అభిమాని ఒకరు మీరు 60 వేల మెజారిటీతో గెలుస్తారు అంటూ వ్యాఖ్యానించడం కూడా బాలయ్య ఆగ్రహానికి కారణమైంది. అతడిని బాలకృష్ణ నోటికొచ్చినట్లు తిడుతూ రెచ్చిపోవడం చూసి అందరూ విస్మయానికి గురయ్యారు.

  మీడియాపై కూడా..

  మీడియాపై కూడా..

  ఇటీవల హిందూపురం ప్రచారంలో మీడియాపై కూడా బాలయ్య నోరు పారేసుకున్నారు. ‘రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు' అంటూ బెదిరించారు. ఆ తర్వాత బాలయయ మీడియాకు క్షమాపణలు చెప్పినప్పటికీ అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.

  వైరల్ అవుతున్న బాలయ్య లేటెస్ట్ ఎటాక్ వీడియో

  బాలయ్య విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అభిమానిపై దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. సినిమాల్లో చేసినట్లు రియల్ లైఫ్‌లో చేసినా కుదురుతుందని అనుకున్నారో? ఏమో? తెలియదు కానీ పరుగెత్తుకుంటూ వెళ్లి అభిమానిని చితకబాదారు.

  English summary
  Tollywood actor Balakrishna has beaten up an enthusiastic fan when he approached him during an election campaign on Sunday in Cheepurupalli in Vijayanagaram district.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more