బాలయ్య, బోయపాటి యాక్షన్ మూవీ.. వచ్చేది ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య బాబు ఇప్పటికే ఒక కొత్త లుక్ ని రెడీ చేసుకున్నాడు. సింహా - లెజెండ్ సినిమాల్లో దర్శకుడు బోయపాటి బాలయ్యను రెండు డిఫరెంట్ షేడ్స్ లల్లో చూపించి ఫ్యాన్స్ కి సరికొత్త కిక్కిచ్చాడు.

ఇక ఇప్పుడు మూడవసారి కూడా ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఏలిమెంట్స్ తో మరో లెవెల్ కి తీసుకెళ్లేలా బాలక్రిష్ణ ని ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ఇప్పటికే ఒక క్లారిటికి వచ్చినట్లు సమాచారం. దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని పండగ వచ్చే ముందు వారమే మంచి రోజు చూసుకొని బాలయ్య ఒక డేట్ ని అయితే మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాడట.

Balakrishna boyapati movie new release date locked

అయితే ఆ డేట్ కి సినిమాను రిలీజ్ చేయాలి అంటే షూటింగ్ కి ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకూడదు. మే 3వరకు లాక్ డౌన్ ఉండడంతో ఆ తరువాత పరిస్థితులను బట్టి షూటింగ్ లను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ నాటికి సినిమా రిలీజ్ చేయాలంటే సెప్టెంబర్ లో షూటింగ్ కి ఎండ్ కార్డ్ వేయాలి. ఆ తరువాత సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి కాస్త గ్యాప్ దొరుకుతుంది. అందుకే కేవలం 4 నుంచి 5నెలల్లో సినిమాను పూర్తి చేసే విధంగా బోయపాటి టీమ్ ప్లాన్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X