twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరూ బంట్రోతులే: బాలయ్య భలే కౌంటర్‌ ఇచ్చాడుగా...

    |

    నందమూరి బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్ చెబుతుంటే విజిల్స్, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. సింహ, లెజెండ్‌తో పాటు పలు చిత్రాల్లో బాలయ్య విలన్లను ఉద్దేశించి చెప్పే కౌంటర్ డైలాగ్స్ పలు సందర్భాల్లో సూపర్ పాపులర్ అయ్యాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత నిజ జీవితంలోనూ బాలయ్య తనదైన శైలిలో అభిమానులను మెప్పిస్తున్నారు.

    హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున రెండో సారి గెలుపొందిన బాలయ్య ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యుడిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నుంచి మీడియా వారు ఆసక్తికర సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

    రాజకీయ నేతలంతా ప్రజల బంట్రోతులే

    రాజకీయ నేతలంతా ప్రజల బంట్రోతులే

    అధికార పక్షానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ‘అచ్చెన్నాయుడు చంద్రబాబుకు బంట్రోతు' అని కామెంట్ చేయడంపై స్పందించాలని మీడియా వారుకోరగా.....‘రాజకీయ నేతలంతా ప్రజల బంట్రోతులే' అంటూ బాలయ్య తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

    ఏ పక్షంలో ఉన్నా ప్రజల కోసమే

    ఏ పక్షంలో ఉన్నా ప్రజల కోసమే

    ‘మేమంతా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా సేవకులం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పని చేసే బంట్రోతులమే. మేము అలా బంట్రోతులమే కానీ వాళ్లు అనుకున్నట్లు కాదు. వారు ఎవరికి బంట్రోతులో వారికే తెలుసు' అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. కొత్త సీఎం జగన్ 15 రోజుల పాలనపై స్పందించాలని కోరగా ... కొంతకాలం వేచి చూద్దాం అన్నారు.

    బాలయ్య 105 మొదలైంది

    బాలయ్య 105 మొదలైంది

    ‘ఎన్టీఆర్ బయోపిక్' తర్వాత బాలయ్య చేయబోయే 105వ చిత్రం గురువారం ప్రారంభం అయింది. సి కళ్యాణ్ నిర్మాతగా హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతున్న ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్త సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

    వరుస సినిమాలు

    వరుస సినిమాలు

    ఇక నుంచి బాలయ్య వరుస సినిమాలు చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రముఖ దర్శకుడు బోయపాటి ఆయనతో సినిమా చేసేందుకు లైన్లో ఉన్నారు. బాలయ్యతో తాను చేయాలనుకున్న కథకు భారీ బడ్జెట్ అవసరం ఉండటంతో అందుకు తగిన నిర్మాత కోసం ఆయన అన్వేషిస్తున్నట్లు సమాచారం.

    English summary
    Balakrishna Strong Counter To Chevireddy Bhaskar Reddy "flunky" comment. Politicians are public servants, Balayya said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X