బోయపాటితో పాటు మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్.. దూకుడు పెంచిన బాలయ్య!
నందమూరి నటసింహం బాలయ్యకు ఈ ఏడాది రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఎంతో ఇష్టపడి చేసిన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీవ్రంగా నిరాశపరిచింది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. ఆ తర్వాత ఎన్నికల హడావిడి మొదలు కావడంతో బాలకృష్ణ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. ఎన్నికల సమరం ముగియడంతో బాలకృష్ణ వరుస చిత్రాలతో దూకుడు పెంచబోతున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ ఇప్పటికే తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. దీనితో వీరిద్దరి హ్యాట్రిక్ మూవీపై ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉండగా బాలయ్య మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 2018 సంక్రాంతికి బాలయ్య జైసింహా చిత్రం విడుదలయింది. ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది.

ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ జైసింహా చిత్రాన్ని తెరకెక్కించారు. కమర్షియల్ ఫార్ములాలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయింది. ఇటీవల బాలయ్య మరోమారు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించారట. జైసింహా చిత్రాన్ని నిర్మించిన సి కల్యాణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి, కేఎస్ రవికుమార్ రెండు చిత్రాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోనున్నాయట. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











