Balakrishnaకు మరో సర్జరీ.. ఆ ఫోటోలో బయటపడడంతో టెన్షన్ లో ఫాన్స్.. అసలు ఏమైందంటే?

చాలాకాలం పాటు సరైన హిట్ లేక ఇబ్బందులు పడిన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఆయనకు తాజాగా సర్జరీ జరిగింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయనకు సర్జరీ జరిగిందన్న విషయం తెలుసుకున్న అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఆయనకు ఏం జరిగింది? ఎందుకు సర్జరీ చేశారు? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

అదే ఊపుతో

అదే ఊపుతో

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదలయి అద్భుతమైన విజయాన్ని సాధించింది.. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించి మిగతా సినిమాలకు కూడా ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమా విజయవంతం కావడంతో బాలకృష్ణ అదే ఊపుతో మరో సినిమా కూడా మొదలుపెట్టారు.

107వ సినిమాగా

107వ సినిమాగా

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పల్నాడు ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది.. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాను బాలకృష్ణ 107వ సినిమా గా సంబోధిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో

అనిల్ రావిపూడి దర్శకత్వంలో

ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి కూడా కొద్ది రోజుల క్రితం ఖరారు చేశారు.. ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ కాలికి సర్జరీ జరిగింది అనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

కుడి మోకాలి నొప్పితో

కుడి మోకాలి నొప్పితో

అఖండ షూటింగ్ జరుగుతున్న సమయంలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న బాలకృష్ణ తాజాగా మరోసారి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం బయటికి రాలేదు కానీ కాలికి ఒక పకట్టుతో ఉన్న ఫోటో బయటకు రావడంతో బాలకృష్ణకు సర్జరీ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ కొద్ది రోజుల నుంచి కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది.

టెన్షన్ అక్కర్లేదు

టెన్షన్ అక్కర్లేదు

బాలకృష్ణ వైద్యులను సంప్రదించి వారు సర్జరీ చేయాలని సూచించడంతో ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అని, ఈ నేపథ్యంలో ఆయనకు సర్జరీ కూడా చేశారని ప్రచారం జరగగా ఈ విషయం మీద బాలకృష్ణ పీఆర్ టీం స్పందించింది. ఆయనకు ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగిందని పేర్కొంది. ఇక ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొంటున్నారని, దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దని కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X