For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bala Krishna: గొప్ప మ‌న‌సు.. ఆ ఒక్క మాటతో ఐదు ల‌క్ష‌లు మాఫీ!

  |

  తండ్రి సినీ వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తనకంటూ సపరేట్ ఇమేజ్ దక్కించుకున్నారు. అప్పటి స్టార్ హీరోలయినా చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో పోటీ పడుతూ బాలకృష్ణ కూడా తనదైన స్థానం సంపాదించారు. దాదాపు 105 పైగా సినిమాల్లో నటించిన బాలకృష్ణ తన అభిమానులతో నడుచుకునే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన అభిమానులు తప్పు చేస్తే అక్కడికక్కడే దండించే బాలయ్య అదే అభిమానులు మంచి చేస్తే వాళ్లకు అండగా నిలబడతారు. అలాగే సేవ అంటే నేనున్నానంటూ ముందుకొచ్చే బాలకృష్ణ చేసిన పని ఇప్పుడు ప్రసంశలు అందుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే

  కుర్ర హీరోలతో పోటీ పడుతూ

  కుర్ర హీరోలతో పోటీ పడుతూ

  గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చివరిగా హిట్ కొట్టిన బాలయ్య ఆ తర్వాత మరో హిట్ కొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో అయితే ఆయన ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా బాలకృష్ణ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.

  కలిసొచ్చిన డైరెక్టర్ తోనే

  కలిసొచ్చిన డైరెక్టర్ తోనే

  ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న బాలకృష్ణ గతంలో తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీనుతో మళ్ళీ జట్టు కట్టారు. అఖండ పేరుతో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయ జానకి నాయక నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు..తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  బోయపాటి తర్వాత గోపీచంద్ తో

  బోయపాటి తర్వాత గోపీచంద్ తో

  బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ అఖండ సినిమా పూర్తి కాకముందే బాలకృష్ణ ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ లైన్లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ తో ఒక సినిమా ఫైనల్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

  చిన్నారికి క్యాన్సర్

  చిన్నారికి క్యాన్సర్

  ఆ సంగతి పక్కన పెడితే బాలయ్య చేసిన ఒక పని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ చిన్నారికి క్యాన్స‌ర్ చికిత్స చేయించేందుకు బాల‌కృష్ణ ముందుకు వ‌చ్చారు. మల్కాజ్ గిరికి చెందిన మణిశ్రీ అనే ఒక చిన్నారి పాప క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ బాలయ్య ఆధ్వర్యంలో నడిచే బ‌స‌వ‌తార‌కం హాస్పిటల్ లో చేరింది. మణిశ్రీ ఆపరేషన్ కోసం 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. చిన్నారి త‌ల్లిదండ్రులు దాత‌ల సాయంతో లక్షా 80 వేల వరకూ డబ్బులు సేకరించారు, కానీ మిగ‌తా డబ్బు స‌ర్ధుబాటు చేయ‌లేని ప‌రిస్థితుల‌లో మణిశ్రీ తల్లిదండ్రులు బాలయ్యనే నమ్మారు.

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  పెద్ద మనసుతో బాలయ్య

  పెద్ద మనసుతో బాలయ్య

  దిక్కుతోచని స్థితిలో ఉన్న వారు బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ని కలిసి ప‌రిస్థితిని వివ‌రించడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మణిశ్రీ వ్యాధి గురించి.. ఆపరేషన్ గురించి బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్ళాడు. వెంటనే బాలకృష్ణ స్పందించి పాప ఆపరేషన్ కు కట్టవలసిన 5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు.

  అంతేకాదు చిన్నారికి తగిన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి సూచించారు. ఇక ఈ పాప అనే కాదు హాస్పిటల్ లో చేరే పేద వారు ఎవరన్నా డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉంటే వారి బదులు దాతల నుంచి ఆ మొత్తాన్ని సేకరించి చికిత్స చేయిస్తారు.

  English summary
  Bala Krishna immediately waived off Rs 5.80 lakhs for the operation of a cancer child.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X