ఊహించని రీమేక్ తో బాలయ్య... అందుకే ఏ ఓటిటిలో ఆ మలయాళ సినిమా రాలేదా?
ఇండియన్ సినిమా దగ్గర నెక్స్ట్ లెవెల్ అవుట్ పుట్ తో సాలిడ్ కంటెంట్ ని అందిస్తున్న సినీ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు మన తెలుగు సినిమా తప్పకుండా ముందు వరుసలో ఉంటుంది. అలాగే బాలీవుడ్ సినిమా సెట్ చేసిన స్టాండర్డ్స్ ని దాటి మనం ఇప్పుడు ప్రపంచ సినిమా దగ్గర షైన్ అవుతున్నాం. కాగా మూవీ లవర్స్ ఎంతసేపు గ్రాండ్ విజువల్స్, బడ్జెట్ ఉన్న సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని నాచురల్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చూసేందుకు ఇష్టపడతారు.
అలా పెద్దగా బడ్జెట్ ఏమి లేకుండా సింపుల్ సినిమాలు అందించడంలో అయితే మలయాళ ఇండస్ట్రీకి మంచి పేరుంది. కానీ మలయాళ సినిమా బాక్సాఫీస్ మాత్రం మిగతా భాషలతో పోలిస్తే కంటెంట్ బాగున్నప్పటికీ ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ దగ్గర భారీ నంబర్స్ నమోదు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా ఈ ఏడాదిలో వరుస 100, 200 కోట్ల సినిమాలు వచ్చి అదరగొట్టాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే చూస్తే ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ ఇంకా ఆడు జీవితం గోట్ లైఫ్ చిత్రాలు వచ్చి భారీ వసూళ్లతో అదరగొట్టాయి. ఇక ఈ చిత్రాలతో పాటుగా తెలుగులో డబ్బింగ్ కాని మరో సినిమా కూడా ఉంది. మరి ఆ సినిమానే "ఆవేశం". మలయాళ వెర్సటైల్ నటుడు, మన పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ అయినటువంటి ఫహద్ ఫాజిల్ నటించిన సినిమానే ఈ ఆవేశం.
మరి ఈ చిత్రం కూడా అక్కడ భారీ వసూళ్లు అందుకొని అదరగొట్టింది. మరి ఈ సినిమా తర్వాత ఓటిటిలో కూడా వచ్చేసింది. మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఇపుడు ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగులో మాత్రం ఇంకా రాలేదు.. మరి ఇన్ని నెలలు అయినా ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కి ఎందుకు రాలేదో ఇప్పుడు క్లారిటీ వినిపిస్తుంది.

కాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొనేశారట. అందుకే ఈ చిత్రం ఇప్పుడు వరకు తెలుగు వెర్షన్ లో ఏ ఓటిటిలో కూడా రాలేదు అని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని అయితే మైత్రి మూవీ మేకర్స్ నటసింహం బాలయ్య తో రిలీజ్ చేసేందుకు ఒప్పించారట. ఇది మాత్రం మెంటల్ మాస్ అని చెప్పాలి.
ఆ సినిమాలో ఫాఫా రోల్ కానీ ఆ డ్రెస్సింగ్ మీసకట్టు అంతా బాలయ్యకి కరెక్ట్ గా సరిపోయేలానే ఉంటాయి. ఇలా ఈ ఊహించని రీమేక్ అయితే బాలయ్య ఇప్పుడు చేయనున్నారని సినీ వర్గాల్లో లేటెస్ట్ గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే చాలా ఏళ్ల తర్వాత బాలయ్య ఓ రీమేక్ చేయనుండడం, అది కూడా ఇలాంటి రీమేక్ ఎంచుకోవడం అనేది ఊహించనిదే అని చెప్పాలి. కాగా ఇప్పుడు బాలయ్య తన 109వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తుండగా ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











