NBK107: షూట్ మొదలైన రోజే బాలయ్య గెటప్ లీక్.. ఆ సినిమాకు ఇది రీమేక్‌ అంటూ!

దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి విజయాలను ఖాతాలో వేసుకున్న ఆయన.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నారు. అయితే, కొంత కాలంగా వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు రావడంతో బాలయ్య నిరాశ చెందారు.

ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది 'అఖండ'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు గోపీచంద్ మలినేనితో సినిమా మొదలెట్టారు. తాజాగా ఈ మూవీ సెట్స్‌ నుంచి బాలకృష్ణ గెటప్ ఫొటో ఒకటి లీకైంది. దీంతో మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

బాలయ్యకు అఖండ విజయం

బాలయ్యకు అఖండ విజయం

నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

గోపీచంద్ మలినేనితో సినిమా

గోపీచంద్ మలినేనితో సినిమా

'అఖండ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుని జోష్‌తో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుస పెట్టి లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

సినిమాలో బడా స్టార్లు భాగం

సినిమాలో బడా స్టార్లు భాగం


ఎంతో పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న విషయం తెలిసిందే.

అక్కడ ప్రారంభమైన సినిమా

అక్కడ ప్రారంభమైన సినిమా

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గత శుక్రవారమే దీన్ని మొదలు పెట్టారు. సిరిసిల్ల పట్టణ శివార్లలో వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభం అయింది. అక్కడ దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది.

తొలి రోజే బాలయ్య లుక్ లీక్

తొలి రోజే బాలయ్య లుక్ లీక్

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజే యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. మొదటి రోజు చిత్రీకరణలో పాల్గొన్న నటసింహం గెటప్‌కు సంబంధించిన లుక్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఇందులో బాలయ్య గుబురు గెడ్డంతో నలుపు రంగు చొక్కా.. లుంగీ ధరించి కనిపిస్తున్నాడు. దీంతో ఇది తెగ వైరల్ అయిపోతోంది.

ఆ సినిమాకు ఇది రీమేక్‌ అని

ఆ సినిమాకు ఇది రీమేక్‌ అని


తాజాగా నందమూరి బాలకృష్ణ లుక్ ఒకటి బయటకు రావడంతో గోపీచంద్ తెరకెక్కిస్తోన్న సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కన్నడంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'మఫ్తీ'కి రీమేక్‌గా తెరకెక్కుతోందట. అందులో శివరాజ్‌కుమార్ పోషించిన పాత్రనే బాలయ్య చేస్తున్నాడట.

ఆ సినిమా కథ ఏమిటంటే?

ఆ సినిమా కథ ఏమిటంటే?

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ హీరోగా నార్తన్ తెరకెక్కించిన చిత్రమే 'మఫ్తీ'. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌ అయిన హీరో.. మాఫియాను ఏరివేసేందుకు చేసిన ప్రయత్నాలతో ఈ సినిమా రూపొందింది. పోలీస్‌గా మొదలైన హీరో డాన్‌గా మారతాడు. అందులో హీరో ఇప్పుడు బాలయ్య కనిపించిన లుక్‌తోనే ఉంటాడు. అందుకే ఇది దానికి రీమేక్‌గా వస్తుందని ప్రచారం మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X