కొబ్బరికొట్టి మూవీ ప్లాప్ కావాలని కోరుకొంటారు.. ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లోకి మరో నూతన సినీ నిర్మాణ సంస్థ వర్గో బ్యానర్ అడుగు పెట్టింది. ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులు, దర్శకులు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. హర్ష కనుమిల్లి హీరోగా, జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడిగా, జిష్ణురెడ్డి నిర్మాతగా సినిమా రంగంలో ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..

Recommended Video

Balakrishna Comments On Corona Vaccine
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు నిర్మాతగా

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు నిర్మాతగా

కార్తీక సోమవారం రోజున సెహరి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం శుభపరిణామం. హీరో హర్ష పుట్టిన రోజున ఇలాంటి కార్యక్రమం జరగడం ఆనందంగా ఉంది. ఇక నా స్నేహితుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈ నిర్మాత నాకు ఫ్యామిలీపరంగా స్నేహితుడు అని బాలకృష్ణ అన్నారు.

దర్శకుడు వచ్చి ఆహ్వానించకపోయినా

దర్శకుడు వచ్చి ఆహ్వానించకపోయినా

దర్శకుడు జానసాగర్ ద్వారక నన్ను ఆహ్వనించలేదు. హీరో, నిర్మాత వచ్చి ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేయాలని కోరారు. అయితే కథ ఏమిటని అడిగితే సినిమా స్టోరి అంతా చెప్పారు. వాళ్లు చెప్పలేదు. కానీ నేను అడిగి కథ మొత్తం తెలుసుకొన్నాను. కథ చెప్పడంలో హీరో, నిర్మాతలు ఉత్సాహం నాకు నచ్చింది అని బాలకృష్ణ పేర్కొంటారు.

సినిమా నచ్చకపోతే బయటకు వెళ్లిపోతా

సినిమా నచ్చకపోతే బయటకు వెళ్లిపోతా

సాధారణంగా సినిమాలను ఎవరూ చూపించరు. ఎందుకంటే నాకు సినిమా నచ్చకపోతే మధ్యలోనే నేను బయటకు వెళ్లిపోతాను. అది నా శాడిజం, మరోటో కాదు. సినిమా తీసిన విధానం నచ్చకపోతే బాధపడుతాను. ఎందుకు ఇలా చేశారని మదనపడుతాను. కొన్నిసార్లు వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తాను. వారు నా సలహాలు పాటిస్తే ఒకే.. లేకపోతే కర్మ అనుకొంటాను అని బాలయ్య తెలిపారు.

ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు

ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు

వర్గో బ్యానర్‌కు సెహారి సినిమా మంచి పేరు, ప్రఖ్యాతులతోపాటు ఆర్థికంగా లాభాలు సంపాదించి పెట్టాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. మనస్పూర్తిగా ఎందుకు కోరుకొంటున్నానంటే.. కొందరు సినిమా ఫంక్షన్లకు వచ్చి కొబ్బరికాయ కొట్టి మూవీ ఫ్లాప్ కావాలని కోరుకొనే వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. అందుకే నేను ఆ మాట అనాల్సి వచ్చింది. నేను తక్కువగా సినిమా ఫంక్షన్లకు వస్తాను. అందుకే మనస్పూర్తిగా నేను సక్సెస్ కావాలని కోరుకొంటాను. అది నా మనస్తత్వం అంటూ బాలయ్య అన్నారు.

నందమూరి ఫ్యామిలీ చరిత్ర అది...

నందమూరి ఫ్యామిలీ చరిత్ర అది...

సినిమా పరిశ్రమలోను, అలాగే రాజకీయాల్లోను నందమూరి ఫ్యామిలికి ఓ విశిష్టత, ప్రాధాన్యత ఉంది. సామాజిక సేవ మా రక్తంలోనే ఉంది. నాన్నగారు సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఎన్నో సామాజిక సేవలు చేపట్టారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి చరిత్ర సృష్టించారో మీకు తెలుసు అంటూ బాలకృష్ణ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X