మొన్న చిరంజీవి, నేడు బాలకృష్ణ.. కుడి భుజానికి సర్జరీ.. ఆ షూటింగే కొంప ముంచిందా? అసలు ఏమైదంటే?

మొన్న చిరంజీవి నేడు బాలకృష్ణ, అవును మొన్న చిరంజీవి కుడిచేతి మణి కట్టుకు సర్జరీ చేయించు ఇప్పుడు బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణకు కుడి భుజం సర్జరీ చేసినట్టుగా హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు అందరిలో టెన్షన్ నెలకొంది. హాస్పిటల్ వర్గాలు కంగారు పడాల్సిందేమీ లేదని చెబుతున్నా సరే గతంలో జరిగిన ఒక సర్జరీ గురించి ప్రస్తావిస్తూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

 కేర్ హాస్పిటల్ ప్రకటన

కేర్ హాస్పిటల్ ప్రకటన

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఆహా కోసం చేస్తున్న అన్ స్టాప్ బుల్ విత్ ఎన్.బి.కె ప్రోమో విడుదల కాగా అది ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో నిలుస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే అనూహ్యంగా బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ జరిగింది అనే విషయం వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ చేశాము అంటూ హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.

కుడి భుజం నొప్పిగా ఉందని

కుడి భుజం నొప్పిగా ఉందని

హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం నందమూరి బాలకృష్ణ కుడి భుజం నొప్పిగా ఉందని కేర్ హాస్పిటల్ సంప్రదించగా కేర్ హాస్పిటల్ బృందం ఆయనకు ఎమ్మారై స్కానింగ్ చేసి సర్జరీ అవసరం అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆయన అక్టోబర్ 31వ తేదీన కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.. ఇక ఈ రోజు ఆయనకు నాలుగు గంటలపాటు కుడి భుజానికి సంబంధించిన సర్జరీ చేసినట్టుగా కేర్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది.

 నాలుగు గంటల పాటు సర్జరీ

నాలుగు గంటల పాటు సర్జరీ

కేర్ హాస్పిటల్ షోల్డర్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బి ఎం ప్రసాద్ నేతృత్వంలో నాలుగు గంటల పాటు మిగతా ఆర్థోపెడిక్ సర్జన్స్ టీమ్ తో కలిసి బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి బాలకృష్ణకి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చాలా బాగున్నారని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆరు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచనలు చేశారు. అయితే ఇదే కుడి భుజానికి 2018లో కూడా బాలక్రిష్ణ సర్జరీ చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

2018లో కూడా

2018లో కూడా

2018 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆయన కాంటినెంటల్ హాస్పిటల్ లో కుడి భుజం శస్త్ర చికిత్స చేయించుకున్నారు. నిజానికి 2016 సమయంలో చేస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో ఆయన కుడిచేతి గాయమైందని అప్పటి నుంచి ఆయన రొటేటర్ ఆఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ పెయిన్ అనే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండగా అప్పట్లో కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించారు.

Recommended Video

Natyam Movie Review By Nandamuri Balakrishna
అభిమానుల టెన్షన్

అభిమానుల టెన్షన్

అయితే అప్పుడు చేయించిన భుజానికి మళ్లీ నొప్పి రావడం ఇప్పుడు అభిమానులను కలవర పెడుతోంది. ప్రస్తుతానికి వైద్యులు ఎలాంటి కంగారు అక్కర్లేదు ఈరోజు డిశ్చార్జి చేస్తామని చెబుతున్నా సరే అభిమానులు మాత్రం టెన్షన్ తొలగడం లేదు. బాలకృష్ణ చేతికి ఏమైందో అని వారంతా కంగారు పడుతున్నారు. దీనికి సంబంధించి బాలకృష్ణ స్వయంగా ఒక వీడియో మెసేజ్ ఇస్తే గాని వాళ్ళు కాస్త కుదుటపడే అవకాశాలు కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X