బాలకృష్ణ కోసం యంగ్ హీరోయిన్.. 109వ సినిమా కూడా ఫిక్స్
ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుసగా సినిమాలను లైన్ పెడుతున్నట్లుగానే నందమూరి బాలకృష్ణ కూడా స్పీడ్ పెంచుతున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమా అయిపోగానే క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేనితో మరో యాక్షన్ కథని సెట్స్ పైకి తీసుకురానున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రూపొందనున్న ఆ సినిమా కోసం భారీ బడ్జెట్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా బాలకృష్ణ ఫైనల్ కథ పూర్తయితే గాని ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇక 108వ సినిమాను అనిల్ రావిపూడితో అనుకుంటున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఆ కథపై బాలయ్యకు కాస్త అనుమానాలు ఉన్నాయట. ఇక F3 పూర్తయిన తరువాత అనిల్ మరోసారి బాలయ్యను కలివనున్నట్లు సమాచారం.

ఇక 109వ సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు టాక్ అయితే వస్తోంది. నిర్మాత సి.కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన బాలకృష్ణ బి.గోపాల్ తో లేదా వివి.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ సరైన కథ సెట్టవ్వలేదు. ఫైనల్ గా 109వ సినిమా ఛాన్స్ శ్రీవాస్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలను తెరకెక్కించిన శ్రీవాస్ బాలయ్యతో డిక్టేటర్ అనే సినిమా కూడా చేశాడు. కానీ ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ బాలయ్య ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











