బాలకృష్ణ కార్పోరేట్ పాలిటిక్స్.. హై వోల్టేజ్ కథను సెట్ చేసిన దర్శకుడు
నందమూరి బాలకృష్ణ కూడా సినిమా షూటింగ్స్ విషయాల్లో స్పీడ్ పెంచుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టేందుకు రెడీ అయ్యారు. కరోనా లేకపోయి ఉంటే ఈపాటికే అఖండ సినిమాను విడుదల చేసి మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తెచ్చేవారు. ఇక అఖండ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ఫినిష్ కానుంది.
ప్రస్తుతం దర్శకుడు బోయపాటి చివరి షెడ్యూల్ కోసం కొన్ని లొకేషన్స్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సినిమా ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అయితే ఇటీవల డైరెక్టర్ శ్రీవాస్ తో కూడా ఒక కథను ఫైనల్ చేసినట్లు టాక్ వస్తోంది. ఆ కథ కార్పోరేట్ పాలిటిక్స్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఇక ఆ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అఖండ అనంతరం గోపిచంద్ మలినేని సినిమాతో పాటు శ్రీవాస్ సినిమాను కూడా ఒకేసారి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే బాలకృష్ణ కోసం అనిల్ రావిపూడి కూడా ఎదురుచూస్తున్నాడు. రామరావు గారు అనే టైటిల్ తో కథను సెట్ చేసి ఏళ్ళు గడుస్తోంది. మధ్యలో కొన్ని మార్పులు చేసినప్పటికీ బాలయ్య అంతగా సంతృప్తి చెందడం లేదట. మరి అనిల్ ఎలా ఒప్పిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











