గర్జించిన అఖండ టీజర్.. రజినీకాంత్ రికార్డులపై గురిపెట్టిన బాలయ్య..
నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న అఖండ చిత్ర టీజర్ రికార్డు వ్యూస్, లైక్స్ సాధిస్తున్నది. బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఈ టీజర్ అగ్ర హీరో రికార్డులను అధిగమిస్తూ దూసుకెళ్తున్నది. ఈ టీజర్ చేస్తున్న రచ్చ గురించి మరింత వివరాల్లోకి వెళితే..
వెండితెరపై లిప్‌లాక్స్.. శృంగార సన్నివేశాల్లో మునిగి తేలిన తారలు

దక్షిణాదిలో రజనీకాంత్ పేరిట రికార్డులు
దక్షిణాదిలో అగ్ర హీరోల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలీ, కాలా చిత్రాల టీజర్ పేరిట రికార్డులు నమోదైంది. 37 మిలియన్లతో కబాలి, 32 మిలియన్ల వ్యూస్‌తో కాలా చిత్రాలు చరిత్ర సృష్టించాయి. ఆ తర్వాత స్థానంలో రోబో2 27 మిలియన్లతో, చిరంజీవి నటించిన సైరా 22 మిలియన్లతో టాప్ స్థానంలో నిలిచాయి.

యువ హీరోల టీజర్ల హంగామా
ఇక యువ హీరో విషయానికి వస్తే.. కన్నడలో చరిత్రను తిరగరాసిన కేజీఎఫ్ చాప్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్2 చిత్రం అత్యంత వేగంగా 25 మిలియన్ల వ్యూస్‌ను కేవలం 15 గంటల్లో రాబట్టింది. పుష్ప 1 రోజులో, మాస్టర్ చిత్రం రెండు రోజుల్లో, రామరాజు ఫర్ భీమ్ టీజర్ 6 రోజుల్లో 25 మిలియన్లు సాధించింది. అయితే అఖండ చిత్రం ఈ రికార్డును కేవలం 5 రోజుల్లోనే సాధించింది.

అఖండ టీజర్‌కు 31 మిలియన్ల వ్యూస్
అయితే అఖండ టీజర్‌కు ఈ మధ్య కాలంలో ఎదురే లేకుండా పోయింది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే 31 మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో ఏ హీరో సినిమా టీజర్‌కు దక్కని ఘనతను బాలయ్య సినిమా సొంతం చేసుకొన్నది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.

కబాలి టీజర్‌పై బాలయ్య గురి
అఖండ సినిమా టీజర్ జైత్రయాత్రను చూస్తుంటే రజనీకాంత్ పేరిట ఉన్న రికార్డులను అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది. కొద్దిరోజుల్లో కబాలి టీజర్ రికార్డును తిరగరాసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తున్నది. రానున్న రోజుల్లో అఖండ టీజర్ ఇదే ఊపును కొనసాగించి కొత్త రికార్డులు నమోదు చేస్తుందా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.
Recommended Video

అఖండ చిత్రంలో నటీనటులు, సాంకేతిక వర్గం
అఖండ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు.
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
డైలాగ్స్: బోయపాటి శ్రీను, ఎం రత్నం
మ్యూజిక్: ఎస్ థమన్
సినిమాటోగ్రఫి: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్స్ కంపెనీ: ద్వారక క్రియేషన్స్
డిస్ట్రిబ్యూషన్: పెన్ స్టూడియోస్


Click it and Unblock the Notifications











