‘బలరామయ్య బరిలోకి దిగితే’: అదిరిపోయిన బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్.. డైరెక్టర్ ఎవరంటే?

జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. గత ఏడాది కూడా ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేకపోయారు. దీంతో రాబోయే రోజుల్లో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకోసం వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌‌తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

బోయపాటి శ్రీను తర్వాత నందమూరి బాలక‌ృష్ణ.. యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ఓ న్యూస్ లీకైంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా బాలయ్య విన్నారని, వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా పొలిటికల్ టచ్ ఉన్న కథతో రూపొందనుందని అంటున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ ఓ పేరు బయటకు వచ్చింది.

Balaramayya Bariloki Digithe Title for Santosh Srinivas - Nandamuri Balakrishna Movie

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 'బలరామయ్య బరిలోకి దిగితే' అనే టైటిల్ రిజిస్టర్ చేయబోతోందట చిత్ర యూనిట్. పల్లెటూరి పాలిటిక్స్ మీద తీసే ఈ సినిమాకు ఇదే సరైన టైటిల్ అని భావిస్తున్నాడట దర్శకుడు. ఈ విషయాన్ని బాలయ్య కూడా అంగీకరించాడని సమాచారం. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నటసింహాం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X