For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Balakrishna Phone Call Goes Viral: బయటపడ్డ నిజస్వరూపం..ఎవరూ ఊహించని విధంగా.. సోషల్ మీడియాలో వైరల్!

  |

  తండ్రి చాటు బిడ్డగా సినిమాల్లో ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ తనకంటూ సపరేట్ ఇమేజ్ దక్కించుకున్నారు. అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో పోటీ పడుతూ బాలకృష్ణ కూడా తనదైన స్థానం సంపాదించారు. దాదాపు 105 పైగా సినిమాల్లో నటించిన బాలకృష్ణ తన అభిమానులతో నడుచుకునే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తన అభిమానులు తప్పు చేస్తే అక్కడికక్కడే దండించే బాలయ్య అదే అభిమానులు మంచి చేస్తే వాళ్లకు అండగా నిలబడతారు. తాజాగా బాలకృష్ణ ఒక అభిమానితో మాట్లాడిన ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

   కుర్ర హీరోలతో పోటీ పడుతూ

  కుర్ర హీరోలతో పోటీ పడుతూ

  గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య ఆ తర్వాత మరో హిట్ కొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 2019లో అయితే ఆయన ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ అందుకున్నాయి. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలకృష్ణ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.

  బోయపాటితో హ్యాట్రిక్

  బోయపాటితో హ్యాట్రిక్

  ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న బాలకృష్ణ గతంలో తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీనుతో మళ్ళీ జట్టు కట్టారు. అఖండ పేరుతో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయ జానకి నాయక నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు..తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  గోపీచంద్ తో పవర్ ఫుల్ సబ్జెక్ట్

  గోపీచంద్ తో పవర్ ఫుల్ సబ్జెక్ట్

  ఇక బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ అఖండ సినిమా పూర్తి కాకముందే బాలకృష్ణ ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ లైన్లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ తో ఒక సినిమా ఫైనల్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. బాలయ్య ఒక ఫ్యాక్షనిస్ట్, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నటిస్తున్నారని అంటున్నారు.

  అభిమానులు మీద చేయి చేసుకుని

  అభిమానులు మీద చేయి చేసుకుని

  ఇక బాలకృష్ణ ఆయన అభిమానులు మధ్య ఉన్న అనుబంధం ఎవరూ వర్ణించలేనిది. తన అభిమానులు తప్పు చేస్తున్నారని అనిపిస్తే అప్పటికప్పుడే దండిస్తాడు బాలయ్య, ఇది బయట వాళ్లకు కాస్త విపరీతంగా కనిపించినా సరే అభిమానులు మాత్రం ఆయన టచ్ చేశాడు అనే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ఇక ఆయన అభిమానులు మీద చేయి చేసుకున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా మాత్రం బాలకృష్ణ తనలోని మరో కోణాన్ని అభిమానికి చేసిన ఫోన్ కాల్ ద్వారా బయట పెట్టారు.

  బాలకృష్ణ పుట్టిన రోజు గ్రాండ్గా

  బాలకృష్ణ పుట్టిన రోజు గ్రాండ్గా

  బాలకృష్ణ సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హిందూపురం నియోజకవర్గం లోని ఒక అభిమానితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానిని కుశల ప్రశ్నలు అడిగిన బాలయ్య ఆ తర్వాత ఆయనకు కొన్ని సూచనలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సదరు అభిమాని బాలకృష్ణ పుట్టిన రోజును గ్రాండ్గా చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.

  పేదవాళ్లకు ఖర్చు పెడితే సంతోషిస్తా

  దీంతో అభిమానిని నివారించిన బాలయ్య కేక్ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదని ఆ కేకు డబ్బులతో కూడా ఏదైనా పేద పిల్లలకు చేయగలరేమో చూడాలని చెప్పుకొచ్చారు. గత ఏడాది సరిగా చెయ్యలేకపోయాం కాబట్టి ఈ సారి గట్టిగా చేస్తామని అభిమాని చెప్పగా అలా ఏమీ వద్దని ఆ డబ్బులు కూడా పేదవాళ్లకు ఖర్చు పెడితే తాను సంతోషిస్తానని బాలయ్య చెప్పుకొచ్చాడు.

  సర్వేజనా సుఖినోభవంతు

  పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలని కోరిన బాలయ్య సర్వేజనా సుఖినోభవంతు అనేది తాను నమ్ముతానని అన్నారు. ఇక అభిమానులే తనకు అండ అని పేర్కొన్న బాలయ్య మీరందరూ బాగుంటే తాను బాగుంటానని చెప్పుకొచ్చారు.. అలాగే మన ఆలోచనలు మంచివైతే మనం ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటామని కూడా బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

  Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna
  మన హాస్పిటల్ ఉంది

  మన హాస్పిటల్ ఉంది

  ఇక మన వాళ్ళకి ఏదైనా జరిగితే మన ఆసుపత్రి ఉందని ఖచ్చితంగా ఎవరికి అవసరం వచ్చినా తాను కాపాడుకుంటామని అని చెప్పుకొచ్చారు. అలాగే సేవా కార్యక్రమాల్లో పడి ఆరోగ్యం గురించి అభివృద్ధి చేయొద్దని పేర్కొన్నారు. ఇప్పటికే సతీష్ అనే అభిమాని ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్ వస్తే ఆయనను ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందించి బాగు చేసి ఇంటికి పంపామని చెప్పుకొచ్చారు. అలా ఈ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

  English summary
  A phone recent conversation of Nandamuri Balakrishna and a fan is out on social media. During the conversation, the fan mentions that they had a simple Birthday celebration for Balakrishna last year due to corona and they are planning to do it grand this year. But balayya says dont plan such things, and he directed him to serve poor even with cake money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X