Vijay Deverakonda కామెంట్స్‌కు బండ్ల గణేష్ కౌంటర్.. తాతలు, తండ్రులుంటే చాలదు.. అది కూడా ఉండాలట!
సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ, లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా హైదరాబాద్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ దేవరకొండ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తాతలు తండ్రులు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ను కొంత మంది హీరోలకు ముడి పెడుతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

లైగర్
వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్ట మొదటి ప్యాన్ ఇండియా మూవీలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతుంది. ఈ సినిమాని పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద చార్మి కౌర్, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా వంటి వారు నిర్మిస్తున్నారు.

ప్రశంసల వర్షం
భారీ ఎత్తున విడుదల చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసింది సినిమా యూనిట్. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన అభిమానులను చూసి విజయ్ దేవరకొండ ఆనందం పట్టలేకపోయాడు. రెండేళ్ల తర్వాత భారీ డిజాస్టర్ అందుకున్న తర్వాత కూడా ఎంతోమంది అభిమానులను చూసిన ఆయన తన తాత ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు కానీ మీరు చూపిస్తున్న అభిమానం బాగుందంటూ వారి మీద ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆసక్తికరంగా
అయితే ఆయన ఏ హీరోని ఉద్దేశించి మాట్లాడలేదు కానీ కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం తాతలు తండ్రుల వారసత్వం అందుకున్న హీరోల గురించి విజయ కామెంట్స్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా బండ్ల గణేష్ ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

సోషల్ మీడియాలో
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇక్కడ ఆయన ఎవరినీ ప్రస్తావించకపోయినా విజయ్ దేవరకొండ కామెంట్స్ చేసిన రెండో రోజు ఇలాంటి ట్వీట్ చేయడంతో విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసి ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

స్నేహితుడి కుమారుడు
అయితే విజయ్ దేవరకొండ తన స్నేహితుడైన గోవర్ధన్ రావు కుమారుడు అని బండ్ల గణేష్ కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాంటిది స్నేహితుడి కుమారుడు మీదే ఇలా ఎందుకు కామెంట్ చేశాడు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











