Vijay Sethupathi మీద దాడి కేసులో ట్విస్ట్.. టార్గెట్ అతనే.. దాడి చేసింది ఎవరంటే?

బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి మీద దాడి ఘటన సంచలనంగా మారింది.. పునీత్ రాజ్ కుమార్ మరణించిన తరువాత కూడా తమిళ హీరోలు ఎవరూ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించని కారణంగా ఆయన మీద దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతుండగా ఈ విషయం మీద తాజాగా క్లారిటీ వచ్చింది. అసలు దానికి కారణం ఏమిటో పోలీసులు గుర్తించారు ఆ వివరాల్లోకి వెళితే

దాడి అంటూ ప్రచారం

దాడి అంటూ ప్రచారం

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మీద బుధవారం నాడు బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి జరిగింది.. ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉండగా వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక వ్యక్తి విజయ్ సేతుపతి పక్కన ఉన్న వ్యక్తి మీద ఒక్కసారిగా ఎగిరి తన్నిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ సేతుపతి మీద ఎవరో దాడి చేశారు అన్నట్లు ప్రచారం మొదలైంది.

ఎట్టకేలకు క్లారిటీ

ఎట్టకేలకు క్లారిటీ

ఎవరు దాడి చేశారో తెలియదు, ఎందుకు దాడి చేశారో తెలీదు కానీ రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా బలగాలు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు పోలీసులు. బెంగళూరు ఎయిర్ పోర్టులో జాన్సన్ అనే వ్యక్తి కూడా వేరే ప్రాంతానికి ప్రయాణిస్తున్నాడు అని వెల్లడించారు.

మద్యం మత్తులో

మద్యం మత్తులో

వెయిటింగ్ హాల్లో విజయ్ సేతుపతి సహాయకుడు మహా గాంధీ చేయి అతనికి తగలడంతో మహా గాంధీతో జాన్సన్ గొడవ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే మద్యం సేవించి ఉన్న జాన్సన్ ఎవరు చెప్పినా వినలేదట. విజయ్ సేతుపతి కూడా వెళ్లి వారించే ప్రయత్నం చేయగా అతని మీద కూడా సీరియస్ అవ్వడంతో వెనక్కి వచ్చేశారు.

 జరిగింది ఒకటైతే మరో ప్రచారం

జరిగింది ఒకటైతే మరో ప్రచారం

ఆ తరువాత ఫ్లైట్ టైం అవ్వడంతో మహాగాంధీ సహా విజయ్ సేతుపతి ఫ్లైట్ ఎక్కేందుకు వెళ్లడంతో ఆ సమయంలో ఉక్రోషం పట్టలేక జాన్సన్ పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం చాలా చిన్న విషయం కావడంతో అతని మీద ఫిర్యాదు చేసేందుకు కూడా విజయ్ సేతుపతి, ఆయన సహాయకుడు ఇష్టపడలేదని అతను ఏమీ అనవద్దు అని వారి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. అయితే ఘటన బెంగుళూరు ఎయిర్ పోర్టులో జరగటం, పునీత్ రాజ్ కుమార్ మరణించి ఎక్కువ రోజులు కూడా కాకపోవడంతో ఈ ప్రచారాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు.

Recommended Video

Romantic Movie Latest Trailer
అందుకే రాలేదా?

అందుకే రాలేదా?

పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత టాలీవుడ్ లో టాప్ హీరోలు వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించడమే కాక శివరాజ్ కుమార్ కి మేమంతా అండగా ఉన్నామని ధైర్యం చెప్పారు. కానీ ఒక్క తమిళ్ హీరో కూడా అక్కడికి వెళ్లకపోవడం సంచలనంగా మారింది. మరణించిన కొద్ది రోజులకు శివకార్తికేయన్ ఇంటికి వెళ్లి సందర్శించి రాగా విశాల్ తన స్నేహితుడు పునీత్ చదివిస్తున్న 1800 మంది బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే తమిళనాడు- కర్ణాటక మధ్య ఉన్న కావేరి జలాల విషయంలోనే తమిళ హీరోలు కన్నడ హీరో కుటుంబాన్ని కలిసే విషయంలో వెనకడుగు వేశారని అంటున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X