Bangarraju: అసలు స్టోరీ ముందే లీక్ చేసిన దర్శకుడు.. ఆ రెండు అంశాలు హైలెట్ అయ్యేలా..

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బంగార్రాజు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనే విషయం ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో సంక్రాంతి సెంటిమెంట్ గా వచ్చినా నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా వస్తున్నా బంగార్రాజు సినిమా కూడా సక్సెస్ అవుతుంది అని చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అసలైన కథ గురించి చాలా క్లియర్ గానే వివరణ ఇచ్చాడు.

సంక్రాంతి హిట్టు సెంటిమెంట్

సంక్రాంతి హిట్టు సెంటిమెంట్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి అనగానే పండగ వాతావరణం నెలకొంటుంది. ఏడాది మొత్తం ఎన్ని సినిమాలు విడుదలైన కూడా అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ముందుగా చెప్పడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ సంక్రాంతికి వచ్చిన సినిమాలు మాత్రం కొంచెం పాజిటివ్ టాక్ అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవచ్చు అని ముందుగానే ఒక గట్టి నమ్మకం ఏర్పడుతుంది.

నాగార్జున కెరీర్ లోనే బిగ్ హిట్

నాగార్జున కెరీర్ లోనే బిగ్ హిట్

సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు ఉన్నా కూడా మరో మీడియం బడ్జెట్ సినిమా వాటితో పోటీ పడేందుకు చాలా బలంగా సిద్ధపడుతుంది. నిర్మాతలు అయితే కాన్సెప్ట్ బాగుంటే చాలా నమ్మకంగా ఉంటారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా గతంలో కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ లోనే సాలిడ్ గా వసూళ్లను అందుకుంది. ఆ సినిమా నాగార్జున కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకుని సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.

పాజిటివ్ బజ్

పాజిటివ్ బజ్

అయితే ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా బంగార్రాజు సినిమా పైనే ఉంది. సోగ్గాడే చిన్నినాయన కథకు కొనసాగింపుగా వస్తున్న బంగార్రాజు సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ విషయంలో కూడా నాగార్జున ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బుల్లితెరపై కూడా ప్రత్యేకమైన ఈవెంట్స్ ప్రమోషన్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

అసలు కథ ఇదే..

అసలు కథ ఇదే..

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమాకు సంబంధించిన అసలు కథ గురించి కూడా ఒక విధంగా క్లారిటీ ఇచ్చేశాడు.. ఫస్టాఫ్ లోనే యువ బంగార్రాజు మొత్తం డామినేట్ చేసే విధంగా చాలా రొమాంటిక్ గా అల్లరి గా కనిపిస్తాడని, ఆ తర్వాత నాగలక్ష్మి కూడా పవర్ఫుల్ పాత్రలతోనే అతడితో పోటీ పడుతుంది అని చెప్పాడు. ఒక ఊరికి వచ్చిన సమస్య తో పాటు గుడికి వచ్చిన సమస్యను నాగ చైతన్య ఎలా ఛేదించాడు అలాగే ఆత్మ గా ఉన్నటువంటి పెద్ద బంగార్రాజు ఎలా సపోర్ట్ చేశాడు అనేది ఈ సినిమాలో అసలైన కథ అని కళ్యాణ్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

Bangarraju Will Be The Sankranthi 2022 Winner For Sure - Nagarjuna | Filmibeat Telugu
మళ్ళీ ఆత్మగానే..

మళ్ళీ ఆత్మగానే..

బంగార్రాజు సినిమాలో నాగచైతన్య యువ బంగార్రాజుగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున ఎప్పటి తరహాలోనే మళ్లీ ఆత్మగానే కనిపించబోతున్నట్లు దర్శకుడు చెప్పేశాడు. సినిమాలో 30 నిమిషాల గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయట. కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు చెబుతున్నాడు. మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X