రామ్ చరణ్ సినిమాను మధ్యలోనే ఆపేసిన స్టార్ డైరెక్టర్.. అసలు కారణమిదే
కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా కూడా అగ్ర హీరోల సినిమాలు కూడా షూటింగ్ మొదలవ్వకముందే ఆగిపోతు ఉంటాయి. ఇండస్ట్రీలో సినిమాలు పుర్తయ్యే వరకు కూడా ఏం జరుగుతోందో నమ్మకంగా చెప్పలేము. ఇక మంచి నిర్మాత ఉన్నప్పటికీ దర్శకులు అనుమానంతో సినిమాలను ఆపేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకనొక సమయంలో రామ్ చరణ్ సినిమా కూడా అలానే ఒక దర్శకుడు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.
అట్టహాసంగా లాంచ్ అయినప్పటికీ సడన్ గా సినిమా ఆగిపోవడంతో తెరవెనుక ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ఇక చాలా రోజుల తరువాత ఆ విషయం బయటకు వచ్చింది. ఆ దర్శకుడు మరెవరో కాదు. కొరటాల శివ. ప్రస్తుతం వరుస విజయాలతో అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్న కొరటాల శివ రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. మిర్చి సినిమా అనంతరం రామ్ చరణ్ కు కథ చెప్పి మెప్పించిన కొరటాల అట్టహాసంగా సినిమాను లాంచ్ కూడా చేయించాడు. అయితే మరోసారి స్క్రిప్ట్ పై అనుమానంతో చరణ్ కు వివరణ ఇవ్వగా పూర్తి కథపై నమ్మకం కుదిరిన తరువాతనే సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పాడట.

ఇక తరువాత ఎప్పుడైనా ఆ సినిమాను చేయాలని భావించిన కొరటాల ఆ తరువాత శ్రీమంతుడు జనతా గ్యారేజ్ సినిమాలతో బిజీ అయ్యాడు. రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా గురించి మర్చిపోయాడో లేక బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాడో తెలియదు గాని.. రామ్ చరణ్ తో మాత్రం అనుకున్న కథను భవిష్యత్తులో ఎలాగైనా తెరకెక్కించాలని ఆలోచన అయితే మనసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ఆచార్య సినిమాలో అయితే గెస్ట్ రోల్ ద్వారా ఎదో ఒక విధంగా రామ్ చరణ్ తో అయితే వర్క్ చేస్తున్నాడు కొరటాల శివ.


Click it and Unblock the Notifications











