బెల్లకొండ రెండో వారసుడు సాయి గణేష్.. ఎలా వస్తున్నాడంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ నుంచి అన్నదమ్ములు హీరోలుగా రావడం కామన్. ఎంత బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద రానించగలిగితేనే మంచి అవకాశాలు అందుకోగలరు. ఇక బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ హిట్స్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్ గా బిగ్ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.
ఇక నెక్స్ట్ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఛత్రపతి రీమేక్ తో నార్త్ లో పవర్ఫుల్ హిట్టు కొట్టాలని ఈ యువ హీరో చాలా బలంగా సిద్ధమవుతున్నాడు. ఇక అతని తమ్ముడు గణేష్ బాబు టాలీవుడ్ ఎంట్రీకి రెండవసారి రెడీ అయ్యాడు. మొదటిసారి పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు.

కోవిడ్ లాక్ డౌన్ కంటే ముందు లాంచ్ అయినా ఆ సినిమా మళ్ళీ సెట్స్ పైకి రాలేదు. ఇక గణేష్ ఒక కొత్త దర్శకుడి సినిమాతో రాబోతున్నాడట. సగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. సీతారా ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో గణేష్ బాబు పవర్ఫుల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మరి బాక్సాఫీస్ వద్ద ఈ యువ హీరో ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











