ప్రభాస్ స్నేహితులతో బెల్లంకొండ న్యూ మూవీ.. ఛత్రపతి తరువాత మరో బిగ్ ప్రాజెక్ట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా సినిమాలు తీసే వారిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. రాక్షసుడు సినిమాతో చాలా కాలం తరువాత హిట్ కొట్టగానే ఈ హీరో రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పైగా డబ్బింగ్ సినిమాలు హిందీలో వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ చాలా వేగంగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.

వివి.వినాయక్ తో ఛత్రపతి సినిమాను రీమేక్ చేయడానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. వీలైతే అనన్య పాండేను ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రభాస్ ఫ్రెండ్స్ తో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ కు దాదాపు హోమ్ ప్రొడక్షన్ అయినటువంటి యూవీ క్రియేషన్స్ బయట హీరోలతో కూడా రెగ్యులర్ గా సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Bellamkonda Direct telugu movie with uv creations after hindi remake

ఇక బెల్లకొండ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఒక కొత్త దర్శకుడు చెప్పిన మాస్ కథ బాగా నచ్చడంతో బెల్లంకొండకు కరెక్ట్ గా సెట్టవుతుందని ఆలోచిస్తున్నారట. ఇంతవరకు బెల్లంకొండ ఈ తరహాలో బడా నిర్మాతల నుంచి ఆఫర్ అందుకోలేదు. మరి యూవీ నిర్మాతలు ఈ హీరోకు ఎలాంటి హిట్టిస్తారో చూడాలి. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ముంబైలోనే ఉంటూ.. హిందీ ఛత్రపతిని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తరువాత మరో డైరెక్ట్ తెలుగు సినిమా ఉంటుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X