బెల్లంకొండ వారసుడు అలా ఫిక్స్.. అందులో తమ్ముడికి మంచి భవిష్యత్ ఉందన్న హీరో
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఖర్చుకు ఏమాత్రం వెనకాడని అతి కొద్ది మంది నిర్మాతల్లో బెల్లంకొండ ఒకరు. అలాంటి బెల్లంకొండ తన కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను హీరోగా నిలబెట్టేందుకు శత విధాల ప్రయత్నం చేశాడు. ఎంత నష్టం వస్తున్నప్పటికీ వెండితెరపై హీరోగా సుస్థిర స్థానాన్ని కల్పించేందుకు రకరకాలు ప్రయత్నించాడు. చివరకు రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టి సక్సెస్ రుచి చూశారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో మంచి చిత్రాలున్నా అవి ఎక్కువగా కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.
బెల్లంకొండ చిత్రాలను భారీ ఎత్తున నిర్మించడంతోనే కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచాయి. ఎట్టకేలకు రాక్షసన్ అనే తమిళ చిత్రాన్ని రాక్షసుడుగా రీమేక్ చేసి మొదటి విజయాన్ని చవిచూశాడు. అయితే పెద్ద కొడుకు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటూ ఉంటే చిన్న కుమారుడు గణేష్ బెల్లంకొండను కూడా వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు. గతేడాది చివర్లోనే మొదటి సినిమాను ప్రారంభించారు. అయితే అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే కరోనా లేకుండా ఉండే ఈపాటికి ప్రేక్షకులను పలకరించేవాడు.

అయితే ఈ లాక్ డౌన్‌లో గణేష్ మాత్రం తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నాడని తెలుస్తోంది. స్టార్ హోటల్‌లో మెనూ కంటే దిమ్మతిరిగే వంటకాలను వండి పెడుతున్నాడట. ఈ విషయాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియాలో తెలిపాడు. ఈ లాక్ డౌన్‌లో వంటలు వండుతూ అందర్నీ హ్యాపీగా చూసుకుంటున్నాడని, అతనిలో ఈ ఫ్యాషన్‌తో కచ్చితంగా చెఫ్ అవుతాడని కితాబిచ్చాడు. ఇలాగే ముందుకు వెళ్తూ ఉండని సోదరుడిని ప్రోత్సహించాడు. గణేష్ వండిన వంటకాలను చూస్తుంటే కచ్చితంగా నోరూరాల్సిందే.


Click it and Unblock the Notifications











