Mokshagna Teja: నందమూరి మోక్షజ్న ఎంట్రీ కన్ఫర్మ్... క్లారిటీ ఇచ్చిన యువ హీరో..

నందమూరి ఫ్యామిలీలో యువ వారసులో ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ అందరి ఫోకస్ ఎక్కువగా బాలయ్య కొడుకుపైనే ఉంది. అతను స్టార్ హీరోగా వెండితెరకు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని వారి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో నందమూరి మోక్షజ్ఞ తేజ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అతని మొదటి సినిమాపై పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఇంత కాలానికి ఒక యువ హీరో మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కొన్ని కథలు కూడా ఫిక్స్ అయినట్లు: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్న హీరోగా ఎంట్రీ ఇస్తాడని కొన్ని కథలు కూడా ఫిక్స్ అయినట్లు చాలా రోజుల నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటికే బాలకృష్ణ కూడా చాలా సందర్భాలలో మోక్షజ్న తెరంగేట్రం గురించి చెప్పకనే చెప్పేశారు. ఇక చాలా సందర్భాలలో మోక్షజ్ఞ లుక్ చూసిన వారు అతనికి హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదనే అభిప్రాయానికి వస్తున్నారు. కానీ మధ్యలో బాలయ్య ఎప్పటికప్పుడు కొడుకు ఎంట్రీ గురించి ఏదో ఒక హింట్ అయితే ఇస్తూ వస్తున్నాడు.

mokshagna teja

క్లారిటీ ఇచ్చిన యువ హీరో: ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ బాబు ప్రస్తుతం నేను స్టూడెంట్ సార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మోక్షజ్న ఎంట్రీ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బెల్లంకొండ సురేష్ బాలకృష్ణ ఒకప్పుడు మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. ఇక మొన్న చెన్న కేశవరెడ్డి సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా బాలకృష్ణ గురించి మాట్లాడారు.

mokshagna teja

చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అని..: ఇక చిన్నప్పటి నుంచి బెల్లంకొండ గణేష్, మోక్షజ్ఞ మంచి స్నేహితులు. అయితే వచ్చే ఏడాది మోక్షజ్న టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని బెల్లంకొండ సోదరుడు క్లారిటీ ఇచ్చాడు. తాను, మోక్షజ్న చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అని గణేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇద్దరం కలిసి రామ్ చరణ్ సినిమాకి వెళ్తే అందరూ టీజ్ చేశారని అన్నారు. ప్రస్తుతం మోక్షజ్న యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని, డాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటాడని, గణేష్ బాబు తెలిపారు.

అతని కనుబొమ్మలు నటిస్తాయని..: నటనలో కూడా మంచి టైమింగ్ ఉందని, డైలాగ్ చెప్పెతపుడు అతని కనుబొమ్మలు నటిస్తాయని, అద్భుతమైన ఎక్స్ ప్రెషన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. కచ్చితంగా ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ తరహాలో మోక్షజ్న మంచి యాక్టర్ అవుతాడని అన్నాడు. వచ్చే ఏడాది కచ్చితంగా అతని ఎంట్రీ ఉంటుందని గణేష్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న డౌట్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.

mokshagna teja

దర్శకులు వాళ్ళే అంటూ ప్రచారాలు: ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మోక్షజ్న ఎంట్రీ ఉంటుందని ఒక ప్రచారం ఉంది. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే సినిమా ద్వారా మోక్షజ్న ఎంట్రీ ఇస్తాడని నందమూరి అభిమానులలో టాక్ నడుస్తోంది. మరి అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందనేది వేచి చూడాలి. అయితే ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిన గ్రాండ్ గానే ఉండే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X