బెల్లంకొండ శ్రీనివాస్ ప్రపంచ రికార్డు: కేజీఎఫ్‌ను వెనక్కి నెట్టేసి మరీ.. అన్ని కోట్ల మందితో అరాచకం

టాలీవుడ్‌లోకి సినీ బ్యాగ్రౌండ్‌తో వచ్చే హీరోల సంఖ్య భారీగానే ఉందన్న విషయం తెలిసిందే. అయితే, అలా ఎంట్రీ ఇచ్చినా.. టాలెంట్ ఉంటేనే పరిశ్రమలో కొనసాగుతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుని చాలా మంది స్టార్లుగా వెలుగొందుతున్నారు. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకడు. రిజల్ట్ ఎలా ఉన్నా తనలోని నటుడిని రోజురోజుకూ బయటకు తీస్తూ సక్సెస్ అవుతున్నాడతను. ఈ నేపథ్యంలో తాజాగా బెల్లంకొండ అబ్బాయి ప్రపంచ రికార్డునే నమోదు చేసుకున్నాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

గ్రాండ్‌గా వచ్చినా నిరాశగానే

గ్రాండ్‌గా వచ్చినా నిరాశగానే

బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా సాయి శ్రీనివాస్ 'అల్లుడు శ్రీను'తో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ, దీనితో హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడు చేసిన 'స్పీడున్నోడు', 'కవచం', 'సీత', 'సాక్ష్యం' వంటి చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.

ఆ సినిమానే కెరీర్ బెస్ట్ హిట్

ఆ సినిమానే కెరీర్ బెస్ట్ హిట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' అనే చిత్రం చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా అతడి కెరీర్‌లోనే అప్పటి వరకూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

హిందీలోకి డబ్బింగ్ చేశారు

హిందీలోకి డబ్బింగ్ చేశారు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రాలు హిందీలోకి డబ్బింగ్ అయి మంచి ఆదరణను అందుకున్నాయి. దీంతో అతడి కెరీర్‌లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'జయ జానకి నాయక' మూవీని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెన్ స్టూడియోస్ హిందీలోకి డబ్బింగ్ చేసింది. 'Jaya Janaki Nayaka KHOONKHAR' పేరిట దీన్ని యూట్యూబ్‌లో విడుదల చేసింది.

భారీ రెస్పాన్స్.. వ్యూస్‌తోనే

భారీ రెస్పాన్స్.. వ్యూస్‌తోనే

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'జయ జానకి నాయక' హిందీ వెర్షన్ Jaya Janaki Nayaka KHOONKHARకు యూట్యూబ్‌లో ఉత్తరాది ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రం 100, 200, 300, 400, 500 మిలియన్ వ్యూస్‌ను వేగంగా అందుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు సాధించింది.

కేజీఎఫ్ రికార్డు బ్రేక్ చేసేసి

కేజీఎఫ్ రికార్డు బ్రేక్ చేసేసి

Jaya Janaki Nayaka KHOONKHAR మూవీ తాజాగా యూట్యూబ్‌లో 700 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. అంటే ఈ చిత్రాన్ని ఏకంగా 70 కోట్లు మంది వీక్షించారు. దీనికంటే ముందే 'కేజీఎఫ్ చాప్టర్ 1' 700 మిలియన్ మార్కును చేరుకుంది. ఫలితంగా ఇండియాలో 700 మిలియన్ మార్కును చేరుకున్న రెండో చిత్రంగా 'జయ జానకి నాయక' రికార్డును నమోదు చేసింది.

శ్రీనివాస్ ప్రపంచ రికార్డుతో

శ్రీనివాస్ ప్రపంచ రికార్డుతో

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక హిందీ వెర్షన్ Jaya Janaki Nayaka KHOONKHAR తాజాగా 709 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. తద్వారా ప్రపంచంలోనే ఎక్కువ మంది యూట్యూబ్‌లో వీక్షించిన సినిమాగా ఇది చరిత్రను సృష్టించింది. అదే సమయంలో 'కేజీఎఫ్ చాప్టర్ 1' (703 మిలియన్లు) రికార్డును కూడా వెనక్కి నెట్టేసి సత్తా చాటుకుంది.

ఆ చిత్రాలతో ఫుల్ బిజీగా

ఆ చిత్రాలతో ఫుల్ బిజీగా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. దీన్ని వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నాడు. దీన్ని మే నెలలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో పాటు 'స్టువర్ట్‌పురం దొంగ'తో పాటు మరికొన్ని చిత్రాలను చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడు వరల్డ్ రికార్డు కొట్టడంతో యమ ట్రెండ్ అవుతోన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X