ప్రభాస్ ఛత్రపతిని ఎక్కువ మంది చూడలేదు.. నాకు బయమేమి లేదు.. బెల్లంకొండ ఛాలెంజ్

టాలీవుడ్ రిచేస్ట్ హీరోల్లో ఒకరైన బెల్లంకొండ శ్రీనివాస్ హిట్టు వచ్చినా రాకపోయినా ఒకేలా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. ఒక సినిమా ఎఫెక్ట్ మరో సినిమాపై పడకుండా బడ్జెట్ తోనే అంచనాలను పెంచేస్తాడు. హై డిమాండ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసి అగ్ర దర్శకులను లైన్ లో పెడతాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నెక్స్ట్ బాలీవుడ్ లో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని ఛత్రపతి కథతో రెడీ కాబోతున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాను ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నట్లు చెప్పాడు.

Recommended Video

Star Director On Cards For Chatrapathi Bollywood Remake
ఆకాశానికి నిచ్చెన..

ఆకాశానికి నిచ్చెన..

బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి. అయితే కెరీర్ లో అతను పెద్దగా సక్సెస్ అందుకున్నది లేదు. జయజానకి నాయక ఓపెనింగ్స్ బాగానే అందుకుంది కానీ ఆ హవాను కంటిన్యూ చేయలేకపోయింది. ఇక రాక్షసుడు సినిమాతో హిట్ టాక్ తెచ్చుకోగానే ఒక్కసారిగా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఛత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాలని చూస్తున్నాడు.

అందుకే ఛత్రపతి రీమేక్..

అందుకే ఛత్రపతి రీమేక్..

వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఛత్రపతి రీమేక్ చేయడానికి గల కారణాన్ని కూడా తెలిపాడు బెల్లంకొండ. ఏడు సినిమాల్లో ఆరు సినిమాలు కూడా హిందీలో డబ్ చేయగా అవి 200మిలియన్లకు పైగా వ్యూవ్స్ ను అందుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఆ సినిమాల కారణంగా ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో జనాలు గుర్తుపడుతున్నారని అంటూ.. బాలీవుడ్ ఎంట్రీ ఇంకా హై రేంజ్ లో ఉండాలని అనుకున్నట్లు చెప్పాడు.

నేను భయపడటం లేదు

నేను భయపడటం లేదు

బెల్లకొండ ఇంకా ఏమన్నాడంటే.. బాలీవుడ్ ఎంట్రీ కోసం ఇంతకుముందు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎందుకో అవి సరైన స్క్రిప్ట్ అనిపించలేదు ఏది కూడా. ఇక ఇప్పుడు ఛత్రపతి రీమేక్ అనగానే సరైన సమయంలో చేస్తున్న కథ అనిపించింది. ఈ కథ నాకు కరెక్ట్ గా సరిపోతుంది. ఒరిజినల్ కథలో ప్రభాస్ చేసిన ఆ పాత్రను రీ క్రియేట్ చేయడానికి నేను బయటపడటం లేదని చెప్పాడు.

ఎక్కువమంది ఛత్రపతి సినిమాను చూడలేదు

ఎక్కువమంది ఛత్రపతి సినిమాను చూడలేదు

మరొక ముఖ్యమైమ విషయం ఏమిటంటే.. బాలీవుడ్ జనాలు ఎక్కువమంది ఛత్రపతి సినిమాను చూడలేదు. అలాగే చూసిన వారు కొందరు మాత్రం మర్చిపోలేదు కూడా. దశాబ్ద కాలం తరువాత చేస్తున్న చిత్రం కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా సినిమా కథలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. నా కెరీర్ లో నేను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే.. ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.. అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X