మరో టాలెంటెడ్ దర్శకుడిని లైన్‌లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్ మొత్తానికి రాక్షసుడు సినిమాతో ఒక సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఈ కుర్ర హీరో మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని చాలా కష్టపడుతున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన మార్కెట్ కి మించిన బడ్జెట్ లో సినిమాలు చేస్తున్నాడు. అలాగే నటనలో కూడా కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

రాక్షసుడు సినిమాతో బాగానే గుర్తింపు దక్కించుకున్న బెల్లంకొండ నెక్స్ట్ అదే తరహాలో కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను వెతుక్కునే పనిలో పడ్డాడు. సంతోష్ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ అనే సినిమాను చేస్తున్న సాయి ఇటీవల మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వామి రారా, కేశవ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మతో కలిసి సాయి శ్రీనివాస్ కొత్త ప్రయోగం చేయబోతున్నాడట.

Bellamkonda sai srinivas green signal to another director

రీసెంట్ గా ఫైనల్ స్క్రిప్ట్ విన్న హీరో దర్శకుడి మీద నమ్మకంతో కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సుధీర్ వర్మ చివరగా డైరెక్ట్ చేసిన రణరంగం సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసిన ఆ సినిమా విడుదల అనంతరం ఊహించని విదంగా నష్టాలను మిగిల్చింది. అయినప్పటికీ దర్శకుడి టాలెంట్ పై నమ్మకంతో బెల్లంకొండ హీరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మరి అతని నమ్మకం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X