For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్‌రాజుకు వినాయక్ ఆఫర్.. ఇరికించొద్దన్న నిర్మాత.. ఘనంగా హీరో బెల్లంకొండ శ్రీను బర్త్‌డే.. !

    |

    భారీ బడ్జెట్ సినిమాలతో తనదైన ముద్ర వేసుకొన్న వర్థమాన హీరో, నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, సాయి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనవరి మూడో తేదిన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో అభిమానుల కోలాహాలం మధ్యన శ్రీనివాస్ బర్త్ డేను జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, RX 100 ఫేం అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్, అభిషేక్ నామా ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

    సాయి శ్రీనివాస్ ఫెయిల్ కాలేదు

    సాయి శ్రీనివాస్ ఫెయిల్ కాలేదు

    ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ.. సాయి శ్రీనివాస్‌తో అల్లుడు శ్రీను చేసినప్పుడు నాకు కొత్త హీరోతో చేస్తున్నట్టు అనిపించలేదు. ప్రతీ ఒక్కరికి ఫెయిల్యూర్ ఉంటాయి. కానీ తన సినిమాలు కొన్ని ఆడకపోయినా శ్రీనివాస్‌ ఫెయిల్ కాలేదు. ఫెయిల్ కాడు. ఇంకా పెద్ద హీరో అవుతాడు అని అన్నారు.

    పాయల్ రాజ్‌పుత్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్‌లో ఉత్తమ విలన్ ఎవరు.. ఓటేసి మీరే డిసైడ్ చేయండి!

    మంచి కథ పడితే స్టార్ హీరోనే

    మంచి కథ పడితే స్టార్ హీరోనే

    నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సాయి శ్రీనివాస్ బెల్లంకొండ హీరో కాకముందే నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నా కూతురికి మంచి స్నేహితుడు. సినిమా సినిమాకు రేంజ్‌ను పెంచుకొంటూ వెళ్తున్నాడు. మంచి కథ పడితే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారడం ఖాయం అని అన్నారు. అంతలోనే మంచి కథలు మీరే సెలెక్ట్ చేయాలని దిల్ రాజుకు వినాయక్ సూచించగా ‘నన్ను ఇరికించకు' అని సరదాగా జోక్ విసిరారు.

    హీరోగా స్టార్ రేంజ్‌తో

    హీరోగా స్టార్ రేంజ్‌తో

    అజయ్ భూపతి మాట్లాడుతూ.. సాయి శ్రీనివాస్ మంచి ఈజ్ ఉన్న హీరో. ఈ ఏడాది మరిన్ని సక్సెస్‌లు సాధించి హీరోగా స్టార్ రేంజ్ పెంచుకొంటాడు. దిల్ రాజు వద్ద చాలా మంది హీరోలు ఉండిపోయారు. ఈ సినిమా పరిశ్రమకు సాయి లాంటి హీరోలు మరింత మంది రావాలి అని అన్నారు.

    నన్ను దీవించిన ప్రతీ ఒక్కరికీ

    నన్ను దీవించిన ప్రతీ ఒక్కరికీ

    అనంతరం సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా జన్మదినం రోజున దీవించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. మీడియా నన్ను ఎప్పుడూ వెన్నంటి ఉంది. అలాగే మున్ముందు అందరి సహకారం నాకు అందించాలని కోరుకొంటున్నాను అని అన్నారు. అంతకుముందు అభిమానులు తీసుకువచ్చిన భారీ కేకును సాయి శ్రీనివాస్ చేత కట్ చేయించారు.

    English summary
    Hero Bellamkonda Sai Srinivias celebrates his Birthday on January 3rd. VV Vinayak, Ajay Bhupati, Dil Raju, Bellamkonda Suresh are attended for this function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X