ఆ బిగ్ బడ్జెట్ సినిమా డిజాస్టర్ అవ్వగానే ఏడ్చేశా.. నాన్న వెంటనే కళ్లు లేని వారి దగ్గరికి తీసుకెళ్లి..

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటించే ఏకైక హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ హీరో ఒక సినిమా ఎఫెక్ట్ మరో సినిమాపై పడకుండా బడ్జెట్ తోనే అంచనాలను పెంచేస్తాడు. సక్సెస్ లో ఉన్న పెద్ద హీరోయిన్స్ తో రొమాన్స్ చేసి అగ్ర దర్శకులను కూడా లైన్ లో పెడతాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నెక్స్ట్ బాలీవుడ్ లో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని ఛత్రపతి కథతో రెడీ కాబోతున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని కెరీర్ లోని ఒక బిగ్ డిజాస్టర్ సినిమా గురించి మాట్లాడాడు.

బాలీవుడ్ లో యాక్షన్ మూవీ

బాలీవుడ్ లో యాక్షన్ మూవీ

బెల్లంకొండ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి. అయితే కెరీర్ లో అతను పెద్దగా సక్సెస్ అందుకున్నది లేదు. జయజానకి నాయక ఓపెనింగ్స్ బాగానే అందుకుంది కానీ ఆ హవాను కంటిన్యూ చేయలేకపోయింది. ఇక రాక్షసుడు సినిమాతో హిట్ టాక్ తెచ్చుకోగానే ఛత్రపతి రీమేక్ అంటూ మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. వివి.వినాయక్ తో కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాలని చూస్తున్నాడు.

అందుకే ఛత్రపతి రీమేక్ చేస్తున్నాడట

అందుకే ఛత్రపతి రీమేక్ చేస్తున్నాడట

వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఛత్రపతి రీమేక్ చేయడానికి గల కారణాన్ని కూడా తెలిపాడు బెల్లంకొండ. ఏడు సినిమాల్లో ఆరు సినిమాలు కూడా హిందీలో డబ్ చేయగా అవి 200మిలియన్లకు పైగా వ్యూవ్స్ ను అందుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఆ సినిమాల కారణంగా ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో జనాలు గుర్తుపడుతున్నారని అంటూ.. బాలీవుడ్ ఎంట్రీ ఇంకా హై రేంజ్ లో ఉండాలని అనుకున్నట్లు చెప్పాడు.

ఆ సినిమా డిజాస్టర్ అవ్వగానే

ఆ సినిమా డిజాస్టర్ అవ్వగానే

ఇక మొదటిసారి ఈ రిచ్ హీరో తన కెరీర్ లోని ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గురించి మాట్లాడాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సాక్ష్యం సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వగానే బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతగానో ఏడ్చేసినట్లు వివరణ ఇచ్చాడు.

కళ్లు లేని వారి దగ్గరకు తీసుకెళ్లి

కళ్లు లేని వారి దగ్గరకు తీసుకెళ్లి

అలా ఏడుస్తుంటే మా నాన్న నన్ను వెంటనే ఒక దగ్గరికి తీసుకెళ్లాడు. ఒక అంద విద్యార్థుల స్కూల్ కు తీసుకెళ్లి వారికి ప్రత్యేకంగా భోజనాలు పెట్టించారు. నేనే స్వయంగా అందరికి వడ్డించాను. నేను సినిమా పోయిన బాధలో ఉంటే మా నాన్న ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నాడు అనుకున్నాను. కానీ అక్కడ అలా భోజనాలు వడ్డించి కారు ఎక్కుతుంటే నాకు ఒక సరికొత్త తృప్తి కలిగింది.. అని తెలిపాడు.

వాళ్ళు.. తినే తిండిని కూడా చూడలేరు

వాళ్ళు.. తినే తిండిని కూడా చూడలేరు

అప్పుడే మా నాన్న ఒక మాట అన్నాడు. నువ్వు ఎదో గొప్పది కోల్పోయావని బాధపడుతున్నావు కదా.. ఆ కళ్లు లేని పిల్లలు కనీసం వారు తినే ఆహారాన్ని కూడా చూడలేరు. అయినప్పటికీ ఎంతో ఆనందంగా ఉన్నారు... అని అనగానే నాలో ఒక్కసారిగా ఆలోచన విధానం మారింది. విజయాలు అపజయాలు చాలా కామన్ అని ఏదైనా సరే అనుభవమే ఒక పాఠమని కూడా వివరణ ఇచ్చారు.

ఛత్రపతి రీమేక్.. నేను భయపడటం లేదు

ఛత్రపతి రీమేక్.. నేను భయపడటం లేదు

బెల్లకొండ ఇంకా ఏమన్నాడంటే.. బాలీవుడ్ ఎంట్రీ కోసం ఇంతకుముందు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎందుకో అవి సరైన స్క్రిప్ట్ అనిపించలేదు ఏది కూడా. ఇక ఇప్పుడు ఛత్రపతి రీమేక్ అనగానే సరైన సమయంలో చేస్తున్న కథ అనిపించింది. ఈ కథ నాకు కరెక్ట్ గా సరిపోతుంది. ఒరిజినల్ కథలో ప్రభాస్ చేసిన ఆ పాత్రను రీ క్రియేట్ చేయడానికి నేను బయటపడటం లేదని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X