ఆ దర్శకుడుతో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటూ వార్తలు.. క్లారిటీ వచ్చింది!
యువ హీరో బెల్లంకొండా శ్రీనివాస్ తన మార్కెట్ పరిధిని పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ సరైన విజయం మాత్రం దక్కడం లేదు. డిసెంబర్ 7న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కవచం చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మెహ్రీన్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ యువ హీరో తేజ దర్శత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. శ్రీనివాస్ తదుపరి చిత్రాలకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వచ్చాయి. బెల్లంకొండ శ్రీనివాస్, పూలరంగడు ఫేమ్ వీర భద్రం చౌదరి కాంబినేషన్ లో సినిమా కుదిరింది అంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలకు బెల్లంకొండ శ్రీనివాస్ వైపు నుంచి క్లారిటీ వచ్చింది.

శ్రీనివాస్ నటించిన కవచం చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం తేజ దర్శత్వంలో నటిస్తున్నాడు. అంతకు మించి శ్రీనివాస్ మరే చిత్రాన్ని అంగీకరించలేదని బెల్లంకొండ శ్రీనివాస్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. అల్లుడు శీను చిత్రంతో హీరోగా పరిచయం అయిన శ్రీనివాస్ కెరీర్ లో తొలి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











