‘అల్లుడు అదుర్స్’తో బిజీగా.. బెల్లంకొండ హీరో లుక్ వైరల్
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. సరైన కమర్షియల్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ప్రయత్నించాడు. అలా చివరగా రాక్షసుడు చిత్రంతో మొదటి సారిగా తిరిగులేని విజయాన్ని అందుకున్నాడు. అంతకు ముందు కూడా పోలీస్ పాత్రలు చేసినా కూడా రాక్షసుడు సినిమాలోని బెల్లంకొండ శ్రీనివాస్ నటన అందర్నీ ఆకట్టుకుంది.
ఆ సినిమా ఇచ్చిన బలంతో వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం సైకో థ్రిల్లర్ కాదని తెలుస్తోంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. అల్లుడు అదుర్స్ అంటూ మళ్లీ అందర్నీ నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మధ్య మళ్లీ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. లాక్ డౌన్ తరువాత మెల్లిమెల్లిగా అందరూ షూటింగ్‌లు ప్రారంభించడం సెట్‌లోకి అడుగు పెడుతుండటం తెలిసిందే.

ఈ మధ్యే షూటింగ్ ప్రారంభించగా ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, సోనూ సూద్ వంటివారు జాయిన్ అయ్యారు. హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్ ఇప్పటికే సెట్‌లో సందడి చేస్తోండగా.. నభా నటేష్ కూడా జాయిన్ అవ్వబోతోంది. అయితే తాజాగా బెల్లంకొండ హీరో ఓ ఫోటోనూ షేర్ చేశాడు. కోర మీసాలను దువ్వుతూ యమ సీరియస్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











