లుక్ పూర్తిగా మారిపోయింది... ఇండస్ట్రీకి మరో వారసుడు వస్తున్నాడు!
ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఆయన తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. 2014లో వివి వివినాయక్ దర్శకత్వంలో 'అల్లుడు శ్రీను' ద్వారా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళుతున్నాడు.
త్వరలో బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు గణేష్ కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. కొత్త దర్శకుడు ఫణి దర్శకత్వంలో గణేష్ హీరోగా సినిమా ప్రారంభం కాబోతోందట. అతడి బాడీ లాంగ్వేజ్‌కు తగిన స్క్రిప్టు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయని, త్వరలోనే గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం కాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది.
అన్నయ్య ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమా ఫంక్షన్లలో బొద్దుగా కనిపిస్తూ సందడి చేసిన గణేష్ నటనలో శిక్షణ తీసుకోవడంతో పాటు, బరువు తగ్గించుకుని హీరోలా తయారయ్యాడు. మరి గణేష్ అదృష్టం ఎలా ఉందో చూడాలి.


Click it and Unblock the Notifications











