భాగమతి డైరెక్టర్‌కి సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ప్రేమకథలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తేజు, కళ్యాణి ప్రయదర్శన్, నివేత పేతురాజ్ మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ సాగుతుందని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ కు కెరీర్ ఆరంభంలో వరుస హిట్స్ పడ్డాయి. కానీ ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. తేజ్ లవ్ యు వరకు కూడా మెగా మేనల్లుడి పరాజయ పరంపర కొనసాగింది.
కొంత గ్యాప్ తీసుకుని తేజు మళ్ళీ చిత్రలహరి చిత్రంలో బిజీ అయ్యాడు. సినిమా ఎంపిక విషయంలో సాయిధరమ్ తేజ్ జోరు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. భాగమతి చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలో దర్శకుడు అశోక్ ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. అశోక్ చెప్పిన కథకు సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దర్శకుడు అశోక్ పిల్లజమిందార్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనుష్కని ప్రధాన పాత్రలో పెట్టి హర్రర్ నేపథ్యంలో భావమతి చిత్రాన్ని డీల్ చేసిన విధానానికి అశోక్ కు ప్రశంసలు దక్కాయి. మరో విభిన్నమైన జోనర్ లో తేజు, అశోక్ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఇక చిత్రలహరి చిత్రాన్ని మైత్రిమూవీస్ సంస్థ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











