బుల్లితెరపై మహేష్ సత్తా.. అదరగొట్టేసిన భరత్ అనే నేను!
సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు చిత్రం తరువాత మహేష్ తో తెరకెక్కించిన చిత్రం ఇది. మహేష్ బాబు తొలిసారి రాజకీయ నాయకుడిగా, సీఎంగా నటించి అలరించాడు.
ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. కాగా గత వారం బుల్లి తెరపై కూడా భరత్ అనే నేను చిత్రాన్ని ప్రదర్శించారు. మహేష్ ప్రతి చిత్రానికి బుల్లితెరపై అదిరిపోయే రేటింగ్స్ వస్తుంటాయి. అదే దారిలో భరత్ అనే నేను కూడా సత్తా చాటింది. భరత్ అనే నేను చిత్రానికి 14.6 టిఆర్పి రేటింగ్ నమోదు కావడం విశేషం.

మహేష్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటించింది. కైరా అద్వానీకి తెలుగులో ఇది డెబ్యూ మూవీ. ప్రస్తుతం మహేష్ బాబు వంశీపైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











