భీమ్లా నాయక్ ట్రైలర్ పవర్ఫుల్ రికార్డ్.. నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత అసలైన పండగ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి రావాల్సిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వడం తోనే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రానా దగ్గుబాటి పవర్ఫుల్ ఆటిట్యూడ్ పాత్రలతో సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నారు అని క్లారిటీగా అర్థం అయింది. అంతేకాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగ్స్ కూడా ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్ లో పాత రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది. ఇక మొత్తానికి రీసెంట్ గా ట్రైలర్ 12 మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం విశేషం. ఎలాంటి యాడ్స్ లేకుండానే రికార్డుని అందుకుంది. ప్రస్తుతం యూట్యూబ్లో భీమ్లా నాయక్ ట్రైలర్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని మరోసారి క్లారిటీ వచ్చేసింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ నిర్మాత నాగవంశి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మలయాళం మంచి విజయాన్ని అందుకున్నటువంటి అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తుండగా డానియల్ శేఖర్ గా రానా దగ్గుపాటి కనిపిస్తున్నాడు.

Bheemla nayak movie trailer number one trening and reached 12 milion

సినిమా ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ రానా దగ్గుబాటి పాత్రలను మాత్రమే నెగిటివ్ గా చూపిస్తున్నట్లు అనిపిస్తుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా చూసిన తర్వాత ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ కలగదు అని సినిమా కంటెంట్ కు తగ్గట్టుగానే ఉంటుంది అని కూడా నిర్మాత తెలియజేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకకు కోసం చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు. అసలైతే అయితే సోమవారం రోజే భారీ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించి అందులోనే ట్రైలర్ ను కూడా విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణించడంతో ఆ వేడుకను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం రోజు భారీ స్థాయిలో అదే ప్రణాళికతో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇక ప్రీ రిలీజ్ వేడుక కోసం తెలంగాణ ఐటి మినిస్టర్ కేటీఆర్ ప్రత్యేక అతిథిగా రానున్నారు. అంతే కాకుండా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలపై మాట్లాడతారు అనేది కూడా అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X