అమ్మాయిల్లో కూడా పవన్ కళ్యాణ్ కు మాస్ ఫాలోయింగ్.. కటౌట్స్ రెడీ చేసి.. వీడియో వైరల్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన సందడి నెలకొంది. కరోనా కష్ట కాలం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమలకు కొన్ని పెద్ద సినిమాలు మంచి బూస్ట్ ఇస్తున్నాయి. ఇక ఫైనల్ గా భీమ్లా నాయక్ సినిమాతో మరొకసారి మిగతా సినిమాలకు కూడా చాలా ధైర్యం కలిగింది. మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మరథం పడతారు అని భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి రుజువయింది. మొదటిరోజు ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ భీమ్లా నాయక్ సినిమా మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ అంతకుమించి అనేలా ఉంటాయి అని అర్థమవుతోంది.

పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతోంది అనగానే అభిమానులు మొత్తం థియేటర్ దగ్గర సందడి చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు కేవలం అబ్బాయిలలో మాత్రమే కాకుండా అమ్మాయిలలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అబ్బాయిలు ఎలాగైతే మాస్ సినిమాలను ఇష్టపడతారో అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా అదే తరహాలో పవన్ ను ఇష్టపడతారు. ఇక సమావేశాలు మీటింగ్ లు నిర్వహిస్తున్నప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా పవన్ పై అభిమానంతో ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతోంది అనగానే కొందరు అమ్మాయిలు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో రోజు థియేటర్ దగ్గర మాస్ స్టైల్ లో ఎంజాయ్ చేయడం విశేషం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ గా మారిపోయింది. ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కటౌట్ కు ప్రత్యేకంగా పాలాభిషేకం చేయడం విశేషం. అమ్మాయిలలో కూడా పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో ఈ ఒక్క వీడియో తో క్లారిటీ వచ్చేసింది. ఇక పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేస్తూ ఆ అమ్మాయి తన అభిమానాన్ని చాటుకుంది. ఇక ఆ వీడియోను మిగతా అభిమానులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలాగా షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇది అంటూ అన్ని వర్గాల వారు ఆయనను ఇష్టపడతారు అని చెబుతున్నారు.

 Bheemla nayak Pawan kalyan lady fan video viral

ఇక బీమ్లా నాయక్ సినిమా శుక్రవారం భారీ స్థాయిలో విడుదల కాగా ఓపెనింగ్స్ ద్వారానే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా మొదటిరోజు ఈజీగా వన్ మిలియన్ డాలర్లను అందుకుంటుంది అని ఒక టాక్ అయితే వస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా సినిమా 28 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో భారీ వసూళ్లను కూడా అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఏపీ లో మాత్రం ఎప్పటిలానే పవన్ కళ్యాణ్ సినిమా పై కఠినమైన ఆంక్షలు విధించడం విశేషం. ఏకంగా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు చాలా థియేటర్స్ దగ్గర ప్రత్యేకంగా డ్యూటీలు చేస్తూ ఉండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X