మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్రో సినిమాలోనే మెగాస్టార్ కూడా..
మెగా అభిమానులకు రాబోయే రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ రాబోతున్నాయి అనే చెప్పాలి. ఎందుకంటే కేవలం కొన్ని నెలల గ్యాప్ లోనే ఓవైపు పవన్ కళ్యాణ్ సినిమా మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా రానుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా కనిపిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆత్రుతగా ఆ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారు.
తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదయ సీతం కు ప్రేమేగా రాబోతున్న బ్రో సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సముద్రఖని దర్శకత్వం వహించిన బ్రో సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 28వ తేదీన విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమా తర్వాత ఆగస్టు 11వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కూడా రాబోతోంది. అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే బ్రో సినిమాలో మెగాస్టార్ కూడా కనిపించబోతున్నాడు. అంటే బ్రో సినిమా విడుదలయ్య థియేటర్లలోనే భోళా శంకర్ కు సంబంధించిన ప్రత్యేకమైన ట్రైలర్ కూడా ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఫాన్స్ ఆ మూమెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా అభిమానులకు ఇదొక మంచి కిక్ ఇస్తుంది అని చెప్పవచ్చు. రెండు రీమేక్ సినిమాలే అయినప్పటికీ కూడా సరికొత్త తరహాలో ఆకట్టుకునే అవకాశం అయితే ఉంది ఇక భోళాశంకర్ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ సోదరిగా నటించగా తమన్నా మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











