మరో బిగ్గెస్ట్ బాలీవుడ్ హీరో నోట పుష్ప డైలాగ్.. అల్లు అర్జున్ రేంజ్ మామూలుగా లేదుగా..
ఇండియా చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువ మంది పాన్ హీరోలలో మన వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ పేరు కూడా చెప్పుకునేందుకు బాలీవుడ్ ప్రముఖులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీ లో తెలుగు హీరోలు అంటే ఒక ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా వారి సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ కూడా పబ్లిసిటీ కోసం వాడేసుకోవడం విశేషం. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ కూడా పుష్ప సినిమాలోని డైలాగులు చెప్పడం విశేషం వివరాల్లోకి వెళితే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయి పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అల్లు అర్జున్ మేనరిజమ్స్ అయితే దేశంలోనే అగ్ర సెలబ్రెటీలు కూడా ఇమిటేట్ చేస్తూ ఉండడం విశేషం. క్రికెట్లో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పుష్పరాజ్ కు సంబంధించిన డైలాగ్స్ తో పాటు అతని స్టైల్ ను కూడా అదే తరహాలో ఇమిటెడ్ చేస్తూ ఉండడం విశేషం. క్రికెట్ లో అయితే కోహ్లీ నుంచి రవీంద్ర జడేజా వరకు అందరూ కూడా పుష్ప డైలాగ్స్ ను వాదేశారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది సినీ ప్రముఖులు కూడా పుష్పరాజ్ కు సంబంధించిన డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న అమితాబచ్చన్ కూడా పుష్ప రాజ్ డైలాగ్ ను తన నోటి గుండా చెప్పడం విశేషం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కోన్ బనేగా కరోడ్పతి రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రతి సీజన్లో సినిమాలకు సంబంధించిన అనేక రకాల ప్రశ్నలను కూడా అడుగుతూ ఉంటారు. ఇక అందులో భాగంగా పుష్ప సినిమాకు సంబంధించిన ప్రశ్న చెప్పే ముందు పుష్ప రాజ్ డైలాగ్ కూడా చెప్పడం విశేషం. ఇక ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది.
దీన్ని బట్టి చూస్తే పుష్ప సినిమా ప్రభావం బాలీవుడ్ ప్రముఖులలో కూడా ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సెకండ్ పార్ట్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ అయితే రెండవ భాగానికి సంబంధించిన ప్రమోషన్లో ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అనుకుంటున్నాడు. కేవలం ఇంకా 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ మళ్ళీ మరికొన్ని సీన్స్ ను రీ షూట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్. ఇక పుష్ప 2ను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సెకండ్ పార్ట్ లో మరొక పవర్ఫుల్ విలన్ కూడా కనిపిస్తాడాని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











