హిట్టు ఎఫెక్ట్.. స్టార్ దర్శకులను వెయిట్ చేయిస్తున్న రామ్!
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో చాలా రోజుల తరువాత సక్సెస్ అందుకున్న యువ హీరో రామ్ పోతినేని. గతంలో ఎప్పుడు లేనివిధంగా మాస్ స్టైల్ లో సినిమా చేసి బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో ఈ కుర్ర హీరో స్టార్ దర్శకులను ఆకర్షించాడు. నెక్స్ట్ ఎలాగైనా మరో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని రెడ్ సినిమాతో రెడీ అవుతున్నాడు.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇకపోతే రెడ్ సినిమా తరువాత రామ్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. కథలు చెప్పడానికి దర్శకులైతే చాలా మంది వస్తున్నారు. కానీ రామ్ మాత్రం ఒప్పుకోవడం లేదట. ఇక రీసెంట్ గా సురేందర్ రెడ్డి కూడా ఒక కథ చెప్పినట్లు టాక్ వచ్చింది. అంతకుముందే మారుతి కూడా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఉన్న కథను చెప్పాడట.

కానీ రామ్ పోతినేని ఇద్దరిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. రెండు కథలు బాగానే ఉన్నప్పటికీ రెడ్ సినిమా తరువాత కమర్షియల్ సినిమాలు చేయడం కన్నా మరో డిఫరెంట్ సినిమా చేయాలని రామ్ వేరే విధంగా ఆలోచిస్తున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని రెడ్ తరువాత రామ్ ఎదో ఒక సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











