పవన్ సినిమా విషయంలో వీడని మిస్టరీ.. ఇంకా ఎన్ని రోజులు వెతుకుతారో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి అఫీషియల్ గా రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు వకీల్ సాబ్ ని పూర్తి చేసిన పవర్ స్టార్ లాక్ డౌన్ అనంతరం మరొక సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. క్రిష్ తో ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా విషయంలో ఇంకా కొన్ని విషయాలు మిస్టరీగానే ఉన్నాయి..

 లాక్ డౌన్ దెబ్బ..

లాక్ డౌన్ దెబ్బ..

పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకడం కష్టతరం అనుకుంటున్న సమయంలో దర్శకుడు క్రిష్ ఆయనతో సినిమా చేసే లక్కీ ఛాన్స్ ని కొట్టేశాడు. ఖుషి నిర్మాత విరుపాక్ష అనే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ పనుల్లో స్పీడ్ పెంచుదాం అనుకున్న సమయంలో చిత్ర యూనిట్ కి లాక్ డౌన్ దెబ్బ గట్టిగానే పడింది. మళ్ళీ ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ ని మొత్తం కొత్తగా సెట్ చేసుకోవాలి అంటే..అది చాలా కష్టం.

ఇంకా మిస్టరీగానే..

ఇంకా మిస్టరీగానే..

ప్రీ ప్రొడక్షన్ లోనే పూర్తి కావాల్సిన చాలా పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేవని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ విషయం వీడని మిస్టరీగానే ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. లాక్ డౌన్ సమయంలో చిత్ర యూనిట్ ఈపాటికే కథానాయికను సెలెక్ట్ చేయాల్సింది. కానీ ఇంకా ఆ విషయం చర్చలో దశలోనే ఉండటం గమనార్హం. త్వరలోనే ఫైనల్ చేయాలని అనుకుంటున్నప్పటికి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట.

వాళ్ళు కాదట..?

వాళ్ళు కాదట..?

పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించేందుకు ఎలాంటి హీరోయిన్ అయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. అయితే కొంత మంది మాత్రం డేట్స్ అడ్జస్ట్ చేయలేమని చెబుతున్నట్లు టాక్ వచ్చింది. ప్రగ్యా జైస్వాల్ నుంచి కీర్తి సురేష్ వరకు.. ఇలా చాలా మంది బ్యూటీల పేర్లు వినిపించాయి. ఇక బాలీవుడ్ బ్యూటీ జాక్వాలిన్ ఫెర్నాండెజ్ ని కూడా సంప్రదించినప్పటికి ఆమె డేట్స్ లేవని చెప్పేసిందట.

Recommended Video

Johnny Movie Completes 17 Years | Most Craziest Movie Ever
మరో టాలెంటెడ్ బ్యూటీ..

మరో టాలెంటెడ్ బ్యూటీ..

టాలెంటెడ్ బ్యూటీ నివేత పేతురాజ్ ని కూడా దర్శకుడు క్రిష్ విరుపాక్ష కోసం సంప్రదించినట్లు టాక్ వస్తోంది. ఇటీవల అల..వైకుంఠపురములో.. సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న నివేత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా బిజీ అవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది. పవన్ సినిమాలో గనక ఈ బ్యూటీ ఫిక్స్ అయితే ఆమె అదృష్టమనే చెప్పాలి. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X