twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున కోసం ఆ నిర్మాతల సాహసం: ఆయన కెరీర్‌లోనే తొలిసారి ఆ రేంజ్‌లో

    |

    ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ధీటైన ఫిజిక్‌తో కనిపిస్తూ.. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. జయాపజయాలను ఏమాత్రం చూడకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఆయనకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ విజయం మాత్రం అందనంత దూరంలోనే ఉండిపోతోంది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నాడు నాగ్. ఈ క్రమంలోనే ప్రస్తుతం మరో సినిమాను చేస్తున్నాడు.

    'గుంటూరు టాకీస్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయింది. ఇక, రెండో షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ షెడ్యూల్‌లు ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫారెన్‌లో జరగాల్సిన షెడ్యూళ్లను క్యాన్సిల్ చేసేశారు. ఇప్పుడు వాటిని ప్రత్యేకమైన సెట్లు వేసి చిత్రీకరించాలని నిర్ణయించారు.

    Big Set For Akkineni Nagarjuna - Praveen Sattaru Movie

    ఈ సినిమా కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. దీని కోసం దాదాపు రూ. 10 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది నాగార్జున కెరీర్‌లోనే భారీ బడ్జెట్ అని అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తోంది.

    English summary
    Akkineni Nagarjuna Now Doing An Action Film Under Praveen Sattaru Direction. Now Unit Built A Big Set for This Movie in Annapurna Studios.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X