అల్లు అర్జున్‌పై కేసు.. హైకోర్టుకు ఐకాన్ స్టార్.. నంద్యాల పర్యటన వివాదంలో ట్విస్ట్!

గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ సినీ వర్గాల్లో హైలైట్ గా వినిపిస్తూ వస్తున్న హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా చాలా ఎక్కువ గానే ఉంటుందని చెప్పాలి. కాగా ఇపుడు అయితే తన పుష్ప 2 తో భారీ రికార్డు బిజినెస్ చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో పాన్ ఇండియా వైడ్ గా బన్నీ నామం వినిపిస్తుంది. అయితే కొన్ని నెలలు కితం నుంచి బన్నీ విసయంలో మరో రకంగా వార్తలు వినిపించ సాగాయి.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులకి కాకుండా వారి వ్యతిరేఖ పార్టీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం అనేది పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. దీనితో ఆ ఒక్క ఇన్సిడెంట్ నంద్యాల దెబ్బతో అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫామిలీగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి.

Big twist to allu arjun on nandya incident here is Icon Star reactions on The Case filed EC

కాగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ పలు మార్లు ఈ చర్చ జరుగుతూ రావడం ఓ ఈవెంట్ లో మళ్ళీ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇలా ఎప్పటికపుడు పుండు మీద కారం జల్లుతున్నట్టు వాడి వేడిగా హైలైట్ అవుతూ ఈ అంశం వైరల్ గా వినిపించ సాగింది. కాగా ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది అని చాలా మందికి తెలియకపోవచ్చు.

నిజమే అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యిందట. కాకపోతే ఇది మెగా ఫ్యాన్స్ పెట్టిందో మరెవరో పెట్టిందో కాదు మరో రకంగా తనపై కేసు నమోదు అయ్యిందట. నిజానికి ఎన్నికల సమయంలో కోడ్ ఉంటుంది అని తెలిసిందే. అలా ఎన్నికలు డేట్ దగ్గరకి వస్తున్నా సమయంలో ఏపీలో 144 సెక్షన్ అమలులో ఉంది.

అంటే పొలిటికల్ మీటింగ్స్ లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ జనాభా కనిపించకూడదు కానీ అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్ప రవి దగ్గరకి వెళ్లడంలో ఈ కోడ్ ని ఉల్లఘించినట్టు అయ్యిందని తనపై కేసు నమోదు అయ్యిందట. కాగా ఈరోజే అక్టోబర్ 22న దీనిపై అల్లు అర్జున్ హై కోర్ట్ లో హాజరై వివరణ ఇవ్వాల్సినట్టుగా కూడా టాక్ ఉంది.

కానీ దీనికి ముందే ఓ రోజు అల్లు అర్జున్ తన వివరణ పంపినట్టుగా తెలుస్తుంది. తాను పొలిటికల్ పరంగా శిల్ప రవి దగ్గరకి వెళ్ళలేదు అని నా ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళాను అని ఆ సమయంలో నా ఫ్యాన్స్ వచ్చారు అని తెలిపాడట. దీనితో ఇది పొలిటికల్ సంబంధిత మీట్ కాదని తనకి ఈ కేసు విషయంలో ఉపశమనం కలిగించాలని అపీల్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి దీనిపై హై కోర్ట్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అనేది మరింత సస్పెన్స్ గా మారింది. అయితే అది ఎంత పర్శనల్ మీటింగ్ అయినప్పటికీ నియోజకవర్గానికే వెళ్లి కలవడం అనేది పొలిటికల్ కోణం లోనే వస్తుంది. మరి బన్నీ కోరిన కోణంలో కోర్టు సానుకూల తీర్పు ఇస్తుందా లేక నెగిటివ్ తీర్పు ఇచ్చి ఊహించని ట్విస్ట్ ఇస్తుందో అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: allu arjun pawan kalyan nandyal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X