మెగా ఫ్యామిలీలో ఆ లోపం.. అది సరిదిద్దుకొంటే.. శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ఏపీ ప్రత్యేక హోదాపై కూడా!
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో శివన్నగా పాపులారిటీ సంపాదించుకొన్న హీరో శివాజీ తాజాగా #90's మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌ను ఈటీవీ విన్ యాప్ నిర్మించింది. జనవరి 5వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌కు హాజరైన శివాజీ తన రాజకీయ కెరీర్, మెగా ఫ్యామిలీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ..
రాజకీయాల్లో ఉన్నానా? ప్రజల పక్షాన ఉన్నానా? అనేది చాలా మందికి కన్‌ఫ్యూజన్. కానీ నాకు ఆ విషయంలో క్లారిటీ ఉంది. రాజకీయాల్లో ఉంటే ఓ పార్టీనో లేదా ఆ పార్టీ నేతలనో తిడుతూ ఉండాలి. అయితే నేను ఎప్పుడూ ప్రజల పక్షాన మాత్రమే ఉన్నాను. అయితే ఓ సమయంలో బీజేపీలో చేరాను. ఆ తర్వాత ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కానో అప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను అని శివాజీ క్లారిటీ ఇచ్చారు.

అయితే బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో లేను. కానీ ప్రజల పక్షాన, యువత పక్షాన నిలబడేందుకు ప్రయత్నించాను. నేను ప్రత్యేక హోదా గురించి పోరాటం చేశాను. దానికి లీడర్ షిప్ చాలా అవసరం. అయితే సరైన లీడర్‌షిప్ లేకపోవడం వల్ల ఆ దిశగా పూర్తిగా పోరాటం చేయలేకపోయాను అని శివాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయ నేతల్లో, పార్టీల్లో పోరాట పటిమ లేకపోవడం వల్ల ఈ తరానికి చెందాల్సిన అవకాశాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నీళ్లు, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్ లాంటి వనరులు ప్రజలకు లభ్యం కావడం లేదు. వాటికి సంబంధించిన డబ్బు, నిధులు రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్తున్నది అని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేదు. ఆ గుణాన్ని ప్రజలు కోల్పోతున్నారు. రాముడు, దేవుడు, అల్లా, జీసస్ లాంటి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ధోరణి పెరిగిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేను పోరాడే శక్తిని కోల్పోయాను. ఎంతకాలం ఒంటరిగా పోరాటం చేయగలను చెప్పండి. నాకు ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగని నేను నా పోరాటాన్ని ఆపలేదు. ప్రజల గొంతుకగా శివాజీ ఎప్పుడూ ఉంటాను. ఇక నుంచి సినిమా రంగంపై దృష్టిపెడుతాను. ఆ క్రమంలోనే వచ్చిన బిగ్‌బాస్‌ను ఒప్పుకొన్నాను అని శివాజీ అన్నారు.

మెగాస్టార్ ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు. అది ముమ్మాటికి నిజం. అసలు వాళ్లకు సీఎం పదవి చేపట్టాలంటే అది ఓ లెక్క కాదు. కానీ ఆ ఫ్యామిలీలో ఎక్కడో లోపం జరుగుతున్నది. అది సరిదిద్దుకొంటే ఆ ఫ్యామిలీలో సీఎం కావడం తథ్యం అని శివాజీ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











