తమ్ముడు వర్మ, ఏంటీ రాజా? మీ బిడ్డలు మీ పేరు చెప్పుకోగలరా? ఆర్జీవీ, పోసానిని ఉతికి పారేసిన శివాజీ!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన , బీజేపీ కూటమి విజయం సాధించింది. కూటమి ప్రభంజనం ధాటికి వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. అంతేకాదు.. దాదాపు 25 ఏళ్ల తర్వాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు మరోసారి చక్రం తిప్పే అవకాశం లభించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి మద్ధతు లేకుండా ఒంటరిగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈసారి మాత్రం పరిస్ధితులు రివర్స్ అయ్యాయి. ఎన్డీయేలోని మిత్రపక్షాలపై ఆధారపడి మోడీ ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. దీంతో కూటమి, ముఖ్యంగా టీడీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు.. కొన్ని చోట్ల తెలుగుదేశం శ్రేణులు రెచ్చిపోతున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ల వద్ద ఉద్రిక్త పరిస్ధితుల దృష్ట్యా రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలు, వైసీపీ కీలక నేతల నివాసాల వద్ద భద్రతను పెంచారు.

తమను ఐదేళ్లు కేసులు పెట్టి వేధించారని, దౌర్జన్యం చేశారని వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే వైసీపీ మద్ధతుదారులను సైతం కూటమికి చెందిన కొందరు ఇబ్బంది పెడుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే యాంకర్ శ్యామల .. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, భయంగా ఉందని ఓ వీడియో రిలీజ్ చేసింది.
తాజాగా వైసీపీ మద్ధతుదారులుగా ఉన్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళీలపై విరుచుకుపడ్డారు మరో నటుడు శివాజీ. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. '' తమ్ముడు వర్మ.. కాదు , కాదు అన్నయ్య. నాకంటే చాలా పెద్దాయన. చంద్రబాబు నాయుడు గారు...మీరు కమ్మ కులస్తులు అని మాట్లాడారు. ఏంటి రాజా.. మనకెందుకు సార్, చేతనైతే రాష్ట్రానికి సాయం చేయాలి, కులాల గురించి ఎందుకు సార్. మీకు , యూట్యూబ్ ఛానెల్స్‌కి, కొంతమంది వెదవలకి తేడా ఏంటీ చెప్పండి సార్ ''

'' వర్మ గారు.. గతంలో మీపై కొంచెం ఘాటుగా మాట్లాడాను సారీ. అంత వయసొచ్చాక సంస్కారం లేకపోతే ఎలా సార్. రోజూ మీరు, స్వప్న గారు ఇద్దరూ కూర్చొని మీరు వేసుకునే జోకులు, మేం అనలేమా సార్. నేను చాలా తెలివైన దాన్నని స్వప్న గారు అనుకుంటూ ఉంటారని.. మేం అనలేమా మేడం. వద్దండి, మీరు బతకడం కోసం.. లక్షలాది , కోట్లాదిమంది కడుపు కొట్టొద్దు. మీరు బతకడం కోసం ప్రాంతంపై విషం చిమ్మొద్దు.. మంచిది కాదు, మీ టైం కాదు ఈరోజు. అయినాసరే మిమ్మల్ని ఎవరు ఏం చేయరు.. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడా హోప్స్ లేవు. ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు.. ''
'' అలాగే ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి గారు..ఆయన గురించి మాట్లాడే రైట్ నాకు లేదు. కానీ ఆయన నా కులం గురించి మాట్లాడారు చాలా సార్లు. తప్పు సార్.. వద్దు సార్.. మీరు ప్రశాంతంగా మీ పని మీరు చూసుకోండి. కులాల గురించి మాట్లాడొద్దు.. ఎప్పుడూ మాట్లాడొద్దు. మీ దగ్గర సంస్కారం ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది.. మీకు బిడ్డలున్నారు, రేపొద్దున ఏమంటారు. నేను పోయినప్పుడు ఫలానోడి బిడ్డల్రా, అంటే అరే పాపం అనాలని.. అంతేకాని వాళ్లకు విలువ తగ్గుతుంది.
ఎన్ని తప్పులు మాట్లాడారు సార్.. ఎన్ని దుర్మార్గాలు మాట్లాడారు సార్. చంద్రబాబు నాయుడు గురించి.. చాలా మిస్‌బిహేవ్ చేశారు మీరు. నాకు బాగా గుర్తు.. 1998 ఈనాడు పేపర్‌లో చంద్రబాబు గురించి చాలా పెద్ద యాడ్ వేశారు. అప్పటి చంద్రబాబుకు , ఇప్పటి చంద్రబాబుకు తేడా ఏంటి సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని డెవలప్ చేశారు '' అంటూ శివాజీ ముగించారు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











