బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ దగ్గర దిమ్మ తిరిగే కార్ల కలెక్షన్
విజయ్ దేవరకొండ ఆస్తి 66 కోట్ల రూపాయలు. ఆయన సినిమాలు, బ్రాండ్స్ ప్రమోషన్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. అలాగే అతనికి సొంత థియేటర్, కాస్ట్లీ కార్లు కూడా ఉన్నాయి. ఏడాదికి రూ.13 కోట్లు సంపాదిస్తున్నాడు.ఇటీవల కాలంలో వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన గ్యారేజ్ లో ఉన్న కార్లపై ఓ లుక్కేద్దాం పదండి.
దాదాపు ఏడేళ్ళ నుంచి హిట్ అన్నదే లేకపోయినా విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ.స్వయం కృషితో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొన క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు. మే 9న ఆయన పుట్టినరోజు.
విజయ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే రౌడీ హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం గడిచి పోవడంతో ఆయన కూడబెట్టిన ఆస్తులు ఎంత అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు రౌడీ బాయ్స్.2016లో విడుదలైన 'పెళ్లి చూపులు' మూవీ విజయ్ దేవరకొండకు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. 2017లో విడుదలైన 'అర్జున్ రెడ్డి'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
2018లో వచ్చిన 'గీత గోవిందం' అతని కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే 2018 నుంచి ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ ను అందుకోలేక పోయాడు విజయ్. అయితే ఆ ఎఫెక్ట్ ఆయన ఆస్తిపై మాత్రం పడలేదు.ఇక ఆయన ఆస్తుల విషయానికొస్తే విజయ్ దేవరకొండ మొత్తం ఆస్తి 66 కోట్ల రూపాయలు. అతను సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. అంతే కాకుండా అతనికి సొంత థియేటర్ కూడా ఉంది. అన్నీ కలుపుకుని ఏడాదికి రూ.13 కోట్లు సంపాదిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. 'లైగర్' సినిమా కోసం రూ.35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక కోటి వసూలు చేస్తాడు. విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఇల్లు ఉంది. ఈ ఇంటి ధర రూ. 15 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే ఆయన అనేక స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాడు.విజయ్ దేవరకొండకు కార్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంది. ఆయన గ్యారేజ్ లో అత్యంత కాస్ట్లీ కారు ఫోర్డ్ మస్టాంగ్ కారు ఉంది. దీని ధర 74 లక్షల రూపాయలు. ఇంకా రూ. 61 లక్షల బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, రూ. 88 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ 350, రూ. 1.31 కోట్ల వోల్వో ఎక్స్‌సి 90, రూ. 80 లక్షల ఆడి క్యూ7 కార్లు ఉన్నాయి.
కాగా విజయ్ దేవరకొండ నటించిన గత మూవీ 'ది ఫ్యామిలీ స్టార్' ఇటీవల విడుదలై మిశ్రమ రివ్యూలను అందుకుంది. ఈ సినిమా నెగెటిక్ టాక్ కారణంగా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి, రవి కిరణ్ కోలా. రాహుల్ సాంకృత్యన్ వంటి యంగ్ డైరెక్టర్స్ తో మూడు కొత్త సినిమాలను లైన్ లో పెట్టాడు.


Click it and Unblock the Notifications











