twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనూహ్యంగా చిక్కుల్లో వర్మ.. ఎస్సీ-ఎస్టీ కేసు నమోదుతో మాట మార్చాడుగా!

    |

    ఒకప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న వర్మ ఇప్పుడు సినిమాల వల్ల పేరు తెచ్చుకోవడం లేదు సరికాద ఏదో ఒక వివాదాన్ని కావాలని ఏర్పరచుకుని వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తనకు ఏమాత్రం సంబంధం లేని విషయం మీద స్పందించి అనవసరంగా ఆయన చిక్కుల్లో పడ్డాడు . దీంతో దాన్ని కవర్ చేసుకునే పనిలో పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే..

    మద్దతు ఇవ్వాలని

    మద్దతు ఇవ్వాలని

    కేంద్రంలోని అధికార ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ఆమెను ముందుగా ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ప్రధానితో పాటు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నడ్డా హాజరు అయ్యారు. అలాగే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. జూలై 1 నుంచి ముర్ము ప్రచారం ప్రారంభించనున్నారు. ఇక ప్రతిపక్ష నేతలకు ముర్ము ఫోన్ చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. సోనియా..మమత.. పవార్ కు ఫోన్ చేసిన ముర్ము, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని అభ్యర్దిస్తున్నారు.

    కౌరవులు ఎవరంటూ

    కౌరవులు ఎవరంటూ


    అయితే ఈ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. దీంతో ఆయనపై బీజేపీ నాయకులు శుక్రవారం నాడు హైదరాబాద్​లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డిలు ఈ ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా 'ద్రౌపది రాష్ట్రపతి ' అయితే పాండవులు ఎవరు? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ వర్మ కామెంట్ చేశారు.

    లీగల్ ఒపీనియన్

    లీగల్ ఒపీనియన్


    అయితే ఒక గిరిజన మహిళ అయిన ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు. అయితే ఈ విషయం మీద అబిడ్స్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని, . అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని అన్నారు.

    ఇష్టమైన పాత్ర

    ఇష్టమైన పాత్ర


    అయితే ద్రౌపది ముర్ముపై చేసిన ట్వీట్ విషయంలో రామ్​గోపాల్​ వర్మపై విమర్శలు రావడంతో పాటు ఫిర్యాదు కూడా చేశారని తెలుసుకుని వర్మ రిటీ ఇచ్చారు. ఇది కేవలం వ్యంగ్యంతో చేశానని, వేరే విధంగా ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. మహాభారతంలోని ద్రౌపది నాకు చాలా ఇష్టమైన పాత్ర, ఇలాంటి పేరు చాలా అరుదు కాబట్టి కొన్ని సంబంధిత పాత్రలు గుర్తుకు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
    పనికి మాలిన వ్యక్తి

    పనికి మాలిన వ్యక్తి


    అంతే కానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాదని రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చారు ఆర్జీవీ. అయితే ఈ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.. ఇదే వివాదంపై రాం గోపాల్‌ వర్మ పై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి అని.. ఆయన తాగి ట్వీట్స్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని.. నిప్పులు చెరిగారు

    English summary
    Bjp leaders filed an sc st case on Ram gopal varma
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X