డైలీ పాలు కావాలి.. బెడ్‌పై అది ఉండాల్సిందే.. బయటపడ్డ హీరో నిజస్వరూపం
మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అలవాటు ఉంటుంది. కొందరికి కొన్ని వింత అలవాట్లు ఉంటాయి. వీటిని బయటకు చెప్పడం కూడా కష్టం. సిల్వర్ స్క్రీన్‌పై దేవుళ్లుగా వెలిగిపోతున్న స్టార్స్ కూడా ఇందుకు అతీతం కాదు. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని వారి అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. తరచూ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వార్తలు, గాసిప్స్ వస్తుంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి.
మద్దాలి శివారెడ్డిగా ఎంట్రీ
భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు రవికిషన్. అక్కడ స్టార్ హీరో అయినప్పటికీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ తదితర భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రంలో విలన్ మద్దాలి శివారెడ్డిగా తెలుగువారిని పలకరించారు రవికిషన్. దీంతో ఆయనను ప్రేక్షకులు మద్దాలి శివారెడ్డిగానే గుర్తుపెట్టుకున్నారు. రేసుగుర్రం హిట్‌తో ఆయనకు తెలుగులో అవకాశాలు క్యూకట్టాయి. సుప్రీం, రాధ, కిక్ 2, సాక్ష్యం, సైరా, హీరో, డాకు మహారాజ్ తదితర చిత్రాల్లో అలరించారు. తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తితో సినీనటుడిగా ఉంటూనే గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఎంపీగా విజయం సాధించారు.

నగ్మాతో ప్రేమాయణం
ఎంపీగా తన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో మన్ననలు పొందుతున్నారు. పలువురు పెద్దలు కూడా రవికిషన్ సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు. చిన్నప్పుడు తండ్రి మందలించడంతో జేబులో 500 రూపాయలు పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రవికిషన్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. నటుడిగా మారడంతో తన తండ్రి ఎంతో సంతోషించారని రవికిషన్ పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు. అలాగే అందరు స్టార్స్ మాదిరిగానే రవికిషన్‌పైనా ఎన్నో వివాదాలు, రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా అలనాటి స్టార్ హీరోయిన్ నగ్మాతో రవికిషన్ ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే రవికిషన్ భార్య ప్రీతీ శుక్లా వార్నింగ్ ఇవ్వడంతోనే నగ్మా- రవికిషన్‌ల మధ్య బ్రేకప్ జరిగినట్లుగా చెబుతారు.
రవికిషన్‌లో రొమాంటిక్ యాంగిల్
అయితే రవికిషన్ బాగా రొమాంటిక్ అని ఇండస్ట్రీలో టాక్. తన వింత అలవాట్ల గురించి ఆయనే పలుమార్లు పంచుకున్నారు కూడా ముఖ్యంగా పాలతో స్నానం, గులాబీ రేకులు పరిచిన బెడ్‌పై పడుకోవడం వంటివి చేశానని రవికిషన్ చెప్పారు. అందరూ తన గురించి చెప్పుకోవాలని.. నా స్టైల్ ఫాలో కావాలనే ఉద్దేశంతో అలా చేసినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ది గాడ్ ఫాదర్ చిత్రాన్ని 500కు పైగా చూశానని.. హాలీవుడ్ నటుడు ఆల్ పాసినో, రాబర్ట్ డీ నీరోలు కూడా ఇలాగే ఉండేవారని రవికిషన్ వెల్లడించారు.
రవికిషన్‌పై ఆ డైరెక్టర్ ఆగ్రహం
తన వింత అలవాట్ల కారణంగా ఓ సినిమాలో అవకాశాన్ని కూడా కోల్పోయానని ఈ బీజేపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ మూవీలో తొలుత తనకు అవకాశం వచ్చిందని.. అయితే నా పాలతో స్నానం, గులాబీ రేకులపై నిద్ర గురించి కశ్యప్‌కు ఎవరో చెప్పడంతో ఆయన షాకైయ్యారని రవికిషన్ తెలిపారు. డైలీ నా స్నానానికి పాలు కొని.. నా ఇతర కోరికలు తీర్చే బడ్జెట్ తన వద్ద లేదని సినిమా నుంచి తప్పించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఆయన రొమాంటిక్ లైఫ్ గురించి తెలుసుకుని జనాలు షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











