సాహో దర్శకుడికి మరో షాక్.. మనసు మార్చుకున్న మెగాస్టార్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా మెగాస్టార్ తదుపరి సినిమాలకు సంబంధించిన కథలపై చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటికే ముగ్గురి దర్శకులకు అవకాశం ఇచ్చిన మెగాస్టార్ ఫైనల్ గా స్క్రిప్ట్ బాగుంటేనే సినిమా చేస్తానని చెప్పారట. కొరటాల శివ సినిమా తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు గాని ముందుగా మెగాస్టార్ అయితే సాహో దర్శకుడు సుజిత్ తోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతను ఇంకా ఫుల్ స్క్రిప్ట్ ఫినిష్ చేయలేదు. అయితే ఇంతలో జై లవకుశ దర్శకుడు బాబీ చెప్పిన కథకు మెగాస్టార్ ఎట్రాక్ట్ అయినట్లు తెలుస్తోంది.

ముందు బాబీ తోనే సినిమా చేసి ఆ తరువాత సుజిత్ ప్రాజెక్టును సెట్స్ పైకి తేవాలని మెగాస్టార్ మనసు మార్చుకున్నారట. మరోవైపు మెహర్ రమేష్ కి కూడా మెగాస్టార్ ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాబీ ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ పనులకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. దీంతో సాహో దర్శకుడు చేయాలనుకున్న సినిమా మరీంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











